రేప్ చేయించి చంపాలని చూసింది.. సాక్షి శివానంద్‌పై సొంత చెల్లి సంచలన ఆరోపణలు

Recommended Video

Ohanna Shivanand Sensational Post On Her Sister Sakshi Sivanand

ఒకప్పుడు తెలుగు తెరపై గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సాక్షి శివానంద్‌. చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, మోహన్ బాబు, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోయిన్ల సరసన నటించి స్టార్ స్టేటస్ పొందిన ఆమె.. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత సాక్షి శివానంద్‌కి సంబందించిన అప్‌డేట్స్ పెద్దగా తెలియలేదు. కానీ తాజాగా ఆమె చెల్లి చేసిన కొన్ని ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. సాక్షి శివానంద్‌ గురించిన షాకింగ్ విషయాలు చెబుతూ ఆమె సోదరి సోషల్ మీడియా పోస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముంది? సాక్షి శివానంద్ క్యారెక్టర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

సాక్షి శివానంద్ సోదరి శిల్పా ఆనంద్

సాక్షి శివానంద్ సోదరి శిల్పా ఆనంద్

కొన్నేళ్ల క్రితం వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సాక్షి శివానంద్ సోదరి పేరు శిల్పా ఆనంద్. ఈమె కూడా ఓ నటియే. తెలుగులో మంచు విష్ణు హీరోగా వచ్చిన మొదటి సినిమా 'విష్ణు' ద్వారా తెరంగేట్రం చేసిన శిలాపా ఆనంద్.. ఆ తర్వాత సరైన అవకాశాలు చేజిక్కించుకోలేదు. దీంతో కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది శిల్పా ఆనంద్.

సోదరిపై శిల్పా ఆనంద్ షాకింగ్ ఆరోపణలు

సోదరిపై శిల్పా ఆనంద్ షాకింగ్ ఆరోపణలు

తాజాగా తన సోదరి సాక్షి శివానంద్ పై సంచలన ఆరోపణలు చేస్తూ ఫేస్ బుక్ పోస్ట్ పెట్టింది శిల్పా ఆనంద్. డబ్బు కోసం తనను రేప్ చేయించి చంపాలని సాక్షి శివానంద్, ఆమె అత్త స్కెచ్ వేశారని శిల్పా ఆనంద్ పేర్కొంది. తన హత్యకై సోదరి సాక్షి శివానంద్, ఆమె అత్త ఎందుకు ప్లాన్ చేశారనే విషయమై వివరంగా తెలిపి షాక్‌కి గురిచేసింది శిల్పా ఆనంద్.

డబ్బు కోసం ఇలా దిగజారి

డబ్బు కోసం ఇలా దిగజారి

సాక్షి శివానంద్, ఆమె అత్త కలిసి భీమా డబ్బుల కోసం ఇంతలా దిగజారి హత్యకు స్కెచ్ వేశారని శిల్పా పేర్కొంది. తనను చంపేసి తన పేరుపై ఉన్న బీమా డబ్బు దక్కించుకునేందుకు తన అక్క కుట్ర పన్నిందంటూ శిల్ప చేసిన ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఓ హీరోయిన్ అయి ఉంది ఇంత నీచపు ఆలోచనలు ఏంటని శిల్ప పెట్టిన పోస్ట్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.

గతంలో సాక్షి శివానంద్ అత్త

గతంలో సాక్షి శివానంద్ అత్త

గతంలో కూడా సాక్షి శివానంద్ అత్త భావన.. డబ్బు కోసం తన భర్తను హతమార్చిందని శిల్ప పేర్కొంది. అయితే ఆ సమయంలో తన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సాక్షి శివానంద్ అత్త భావన అమెరికా పారిపోయిందని శిల్ప తన పోస్ట్ లో రాసుకొచ్చింది. అదే కోణంలో ఇప్పుడు తనను కూడా చంపి భీమా డబ్బులు తీసుకోవాలని వాళ్ళు ప్లాన్ చేశారని వెల్లడించింది శిల్పా ఆనంద్. తనకు జరుగుతున్న అన్యమయంపై అభిమానుల సపోర్ట్ కావాలని కోరింది శిల్ప.

 సాక్షి శివానంద్ సినిమాలు

సాక్షి శివానంద్ సినిమాలు

తెలుగులో సాక్షి శివానంద్ మహేష్ బాబు సరసన యువరాజు, చిరంజీవి సరసన ఇద్దరు మిత్రులు చిత్రాల్లో నటించి.. ఆ తరువాత పలు సినిమాలతో ఆకట్టుకొని గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X