Sreeleela: లవ్ ప్రపోజల్స్‌పై శ్రీలీల ఓపెన్... బాలయ్య గురించి అప్పుడే చెప్తానంటూ..
బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం స్కంద. ఇక ఈ మూవీ రామ్ కెరియర్ లోనే తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం.. ఆగస్టు 26న సాయంత్రం శిల్పకళావేదికలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఇక ఈ ఈవెంటులో చీఫ్ గెస్టుగా బాలయ్య మెరిశారు. ఇక ఈ ఈవెంటులో శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం స్కంద. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో ఘనంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్కంద మూవీ రామ్ పోతినేని కెరియర్ లో మొదటి పాన్ ఇండియా మూవీ. షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది ఈ మూవీ. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ బాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆగస్టు 26వ తేదీన సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఇక ఈ ఈవెంటుకు హాజరైన టాలీవుడ్ సెన్సెషన్ యంగ్ హీరోయిన్ శ్రీలీల హాజరయ్యింది. ఇక సుమ.. శ్రీలీలను లవ్ ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా అంటూ అడిగితే తనదైన శైలీలో శ్రీలీల ఆన్సర్ చేసింది. ఇప్పటి వరకు రాలేదు... సెప్టెంబర్ 15వ తేదీ తర్వాత రావొచ్చు అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంటులో మాట్లాడుతూ... ఆసక్తికర కామెంట్స్ చేసింది.
Kasthuri Shankar: దుల్కర్‌కు జరిగినట్లే తనకు జరిగిందంటూ.. గృహలక్ష్మి కస్తూరి షాకింగ్ కామెంట్స్
అందరికీ నమస్కారం.. మీ ప్రేమకు చాలా థ్యాంక్స్. పాట కూడా పాడాను మీకోసం. ధమాకా మూవీ రిలీజ్ కు ముందు సైన్ చేసిన సినిమా ఇది. బాలయ్య గారు గురించి నేను చెప్పాల్సింది చాలా ఉంది.. మరో వన్ మంత్ లో కలుస్తాను అప్పుడు చెప్తాను. గండరబాయ్ షూట్ చేసేప్పుడు ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఆ పాట షూటింగ్ లో చాలా ఎనర్జిటింగ్ గా చేశాం.
చాలా మంచి పాత్ర లభించింది ఈ సినిమాలో. స్పెషల్లీ శ్రీకాంత్ గారికి థ్యాంక్స్. మా ఇంట్లో వాళ్లంతా బిగ్ ఫ్యాన్స్. మీ సినిమాతో నా కెరియర్ స్టార్ట్ చేశాను. ఇదే సినిమా సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ అవుతుంది. మీరంతా వచ్చి చూడాలని కోరుకుంటున్నా. అంటూ చెప్పుకొచ్చింది.
ఇక అంతకు ముందు ఎస్ ఎస్ తమన్ తో కలిసి శ్రీలీల స్టేప్పులు వేస్తూ.. పాట కూడా పాడింది. మొత్తానికి ఈ ప్రీ రిలీజ్ ఈవెంటులో శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్ గా మెరిసింది. ఈ ముందు మొదటి పాన్ ఇండియా చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది ఈ భామ.


Click it and Unblock the Notifications











