కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆర్జీవీ హీరోయిన్.. రాహుల్ సమక్షంలో.. ఎక్కడ నుంచి పోటీ అంటే
ప్రముఖ హీరోయిన్ ఊర్మిలా మతోంద్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో మంగళవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఊర్మిల పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు. ఆమెను సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాను కప్పి కాంగ్రెస్‌లోకి స్వాగతించారు. అంతం, రంగీలా, గాయం, అనగనగా ఒక రోజు తదితర చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ కోసం సేవలు
ఊర్మిల పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మాట్లాడుతూ.. కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆమె కృషి చేస్తారు. పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు సహకారాన్ని అందిస్తారు అని అన్నారు.

అందుకే రాజకీయాల్లోకి వచ్చా
మీడియా సమావేశంలో ఊర్మిలా మాట్లాడుతూ.. కాంగ్రెస్ సిద్ధాంతాలపట్ల అంచంచలమైన నమ్మకం, విశ్వాసం ఉంది. అందుకే పార్టీలో చేరాను. ఎన్నికల కోసం పార్టీలో చేరలేదు. పార్టీ బలోపేతానికి పనిచేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను అని అన్నారు.

టికెట్ కేటాయిస్తే పోటీకి సై అని
కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దం అని ఊర్మిల అన్నారు. ఆమెకు ఉత్తర ముంబై లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉంది. భారతీయ జనతాపార్టీ అభ్యర్థి, ఎంపీ గోపాల్ శెట్టిపై పోటీకి సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ముంబై నుంచి బరిలోకి
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఊర్మిలకు పార్టీ కీలక నేతల నుంచి ఘనస్వాగతం లభించింది. ముంబై కాంగ్రెస్ చీఫ్ మిలింద్ దియోరా, పార్టీ నేత సంజయ్ నిరుపమ్ తదితరులు ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆమె జెయింట్ కిల్లర్‌గా మారే అవకాశం ఉందనే ఆశాభావాన్ని పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











