For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రముఖ హీరోయిన్‌కు రోడ్డు ప్రమాదం: తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు.. ఘటనలో తెలుగమ్మాయి మృతి

  |

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. బిగ్ బాస్ షో ద్వారా ఎనలేని గుర్తింపును అందుకున్న నటి యషికా ఆనంద్. కొంత కాలంగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న ఈమె.. తాజాగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో యషికకు తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ఆమెతో ప్రయాణిస్తోన్న వారిలో ఓ స్నేహితురాలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇందులో మరికొందరికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయని అంటున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..!

  శనివారం అర్ధరాత్రి కారు ప్రమాదం

  శనివారం అర్ధరాత్రి కారు ప్రమాదం

  శనివారం రాత్రి యషికా ఆనంద్ తన స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో తమిళనాడు రాష్ట్రంలోని మల్లవరం సమీపంలో ఉన్న ఓ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు నాలుగైదు పల్టీలు కొట్టినట్లు సమాచారం. దీంతో ఈ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  గ్లామర్ ట్రీట్‌లో హద్దు దాటేసిన నాని హీరోయిన్: ఓ రేంజ్‌లో అందాల ఆరబోతతో సెగలు రేపుతోన్న బ్యూటీ

   ఒకరు మృతి... వాళ్లకు గాయాలు

  ఒకరు మృతి... వాళ్లకు గాయాలు

  ప్రమాదం జరిగిన సమయంలో కారులో యషికా ఆనంద్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు మగవాళ్లు కాగా.. మరో అమ్మాయి ఉంది. ఈ ప్రమాదంలో యషికతో పాటు ఇద్దరు అబ్బాయిలకు తీవ్రంగా గాయాలు అయ్యాయని సమాచారం. మరో అమ్మాయి మాత్రం స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. వీళ్లందరినీ స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

   పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పైన

  పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పైన

  ప్రమాదం జరిగిన తర్వాత స్థానికుల సహాయంతో పోలీసులు గాయపడిన వాళ్లందరినీ ఆస్పత్రికి తరలించారట. క్షతగాత్రులుగా ఉన్న యషికా ఆనంద్‌తో పాటు ఇద్దరు అబ్బాయిల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్లు ముగ్గురూ వెంటిలేటర్‌పై ఉన్నారని అంటున్నారు. ఇక, మృతి చెందిన అమ్మాయి పేరు భవానీ అని.. ఆమెది హైదరాబాద్ అని విశ్వసనీయంగా తెలిసింది.

   అక్కడి నుంచి వస్తుండగానే ఇలా

  అక్కడి నుంచి వస్తుండగానే ఇలా

  విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. యషికా ఆనంద్ శనివారం రాత్రి వీకెండ్ పార్టీలో పాల్గొందని తెలుస్తోంది. ఇందుకోసం మరో ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో వెళ్లిన ఆమె.. తిరిగి వచ్చే సమయంలోనే ప్రమాదానికి గురైందని అంటున్నారు. ఇక, ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ఉన్న వాళ్లు సీటు బెల్టులు కూడా పెట్టుకోలేదన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.

  ప్రమాదానికి కారణం మద్యమేనా?

  ప్రమాదానికి కారణం మద్యమేనా?

  యషికా ఆనంద్ ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురవడంతో.. కోలీవుడ్‌ వర్గాలు ఉలిక్కి పడ్డాయి. ఇక, ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటన జరిగానికి మద్యం మత్తే కారణం అయి ఉంటుందని పోలీసులు ప్రాధమిక విచారణలో పేర్కొన్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దానికితోడు కారు అతివేగంగా నడిపినట్లు కూడా టాక్ వినిపిస్తోంది.

  నగ్నంగా హీరో, హీరోయిన్ హగ్: ఘాటు ఫోజును ట్రై చేసిన సుడిగాలి సుధీర్.. అసలు ట్విస్ట్ అక్కడే!

  Salman Khan Kisses Disha Patani | 32ఏళ్ల సినీ కెరీర్ లో ఇదే ఫస్ట్ టైం || Filmibeat Telugu
  యషికా ఆనంద్ సినీ నేపథ్యం ఇదే

  యషికా ఆనంద్ సినీ నేపథ్యం ఇదే

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి గుర్తింపును తెచ్చుకుని.. ‘కవలై వేండాం' అనే సినిమాతో నటిగా పరిచయమైంది యషికా ఆనంద్. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల్లో నటించింది. అందులో విజయ్ దేవరకొండ చేసిన ‘నోటా' కూడా ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె.. బిగ్ బాస్ రెండో సీజన్‌లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొంది. ప్రస్తుతం యషిక ఏకంగా ఐదు సినిమాలను చేస్తోంది.

  English summary
  Kollywood Heroine Yaashika Aanand Met An Accident at Mid Night of Saturday. In This Incident She and another friend survived with major injuries, one of Yashika's close friends lost her life in the fatal crash.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X