Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బన్నీ మైకంలో ఘాటు భామ.. అతని మూమెంట్స్ సూపర్‌గా ఉటాయంటూ దాచకుండా చెప్పేసింది
టాలీవుడ్ హీరోల్లోకెల్లా అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజే వేరు. గంగోత్రి సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన ఆయన స్టైలిష్ స్టార్ గా అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు. ఇక టాలీవుడ్ చిత్ర సీమలో ఈయన డాన్స్ అంటే ఇష్టపడని వారుండరు. క్లాస్, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా హుషారెత్తే స్టెప్పులేయడం ఆయనకు మాత్రమే సొంతం. దీంతో ఇప్పటికే ఈయన లోని డాన్సింగ్ సెన్స్ చూసి తాము ఫిదా అయ్యామని ఎందరో హీరోయిన్స్ ఓపెన్ గా చెప్పేశారు. అందుకే బన్నీకి లేడీ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. కాగా తాజాగా మరో యంగ్ బ్యూటీ బన్నీ డాన్స్ పై తన స్పందన తెలియజేసింది.
ఇప్పటికే ఉన్న లిస్టులో జరీన్ ఖాన్ పేరు కూడా
టాలీవుడ్ లో డాన్సింగ్ పరంగా సూపర్ స్టార్ ఎవరు అంటే.. ముందుగా చెప్పే పేరు అల్లు అర్జున్. ఈ విషయం పట్ల ఇప్పటికే టాలీవుడ్ లోని ఎందరో నటీనటులు తమ అభిప్రాయం వెలిబుచ్చారు. కాగా తాజాగా ఈ లిస్టులో యంగ్ హీరోయిన్ జరీన్ ఖాన్ కూడా చేరిపోయింది. గోపీచంద్ హీరోగా వస్తున్న 'చాణక్య' సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న అందాల భామనే జరీన్ ఖాన్.
షూటింగ్లో పాల్గొన్న తర్వాత నేరుగా చూశా
చాణక్య సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయం కాబోతున్న సందర్బంగా ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు తెలుగు విలేకరులు. వీటన్నింటికీ ఓపికగా సమాధానం చెప్పిన ఆమె దక్షిణాదిలో షూటింగ్ వాతావరణం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపింది. 'దక్షిణాది వారి క్రమశిక్షణ, కష్టపడే తీరు, వృత్తిపట్ల నిబద్ధత గురించి నేను చాలాసార్లు విన్నాను. ‘చాణక్య' సినిమా షూటింగ్లో పాల్గొన్న తర్వాత దాన్ని నేరుగా చూశా' అని ఆమె చెప్పుకొచ్చింది.
తెలుగులో ఇష్టమైన డ్యాన్సర్
ఇక టాలీవుడ్ హీరోల్లో మీకు ఇష్టమైన డ్యాన్సర్ ఎవరికి అని ప్రశ్నించగానే.. ఇంకెవరు అల్లు అర్జున్ అని ఠకీమని ఆన్సర్ చేసింది జరీన్ ఖాన్. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది మంచి డ్యాన్సర్లు ఉన్నారు. కానీ వారిలో నాకు అల్లు అర్జున్ మూమెంట్స్ బాగా నచ్చుతాయి. అతను స్టెప్పులు వేసే తీరు నాకు చాలా ఇష్టం అని జరీన్ పేర్కొంది.
చాణక్యలో జరీర్ ఖాన్.. త్రివిక్రమ్‌తో బన్నీ
హీరోయిన్ జరీర్ ఖాన్ ప్రస్తుతం చాణక్య సినిమా షూటింగ్ లో పాల్గొంటుండగా, అల్లు అర్జున్ త్రివిక్రమ్ సెట్స్ పై చురుకుగా కదులుతున్నారు. ఈ చిరంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. బన్నీ కెరీర్ లో నా పేరు సూర్య లాంటి డిసాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు ఆయన అభిమానులు.