హీరోయిన్ల జాతకాలు 2011

By Bojja Kumar

ఈ సంవత్సరం టాలీవుడ్ కి చాలా మంది కొత్త హీరోయిన్ల వచ్చారు. కొత్త వారి ధాటికి కొందరు పాత వారు కొట్టుకు పోతే...పాత వారి దాటికి కొందరు కొత్త వాళ్లు కూడా అడ్రస్ లేకుండా పోయారు. మరి వారి జాతకాలపై ఓ సారి లుక్కేద్దాం.

శృతిహాసన్‌ అనగనగా ఓ ధీరుడుతో నేరుగా తెలుగులో అరంగేట్రం చేసింది. ఆ సినిమా నటిగా గుర్తింపు నిచ్చినా వసూళ్లలో నిరాశపరిచింది. అనువాద చిత్రం సెవంత్‌ సెన్స్‌, సిద్ధార్థతో ఓ మై ఫ్రెండ్‌ చిత్రాలలోనూ శృతి నటించింది. వీటిలో ఓ మై ఫ్రెండ్‌ నటనపరంగా ఫరవాలేదనిపించుకుంది.

అమలాపాల్‌ బెజవాడ సినిమాతో నేరుగా తెలుగు పరిశ్రమలో ప్రవేశించినా ఫలితం తారుమారైంది. అనువాద చిత్రం ప్రేమఖైదీ మాత్రం నటిగా గుర్తింపు నిచ్చింది. నిత్యామీనన్‌ అలా మొదలైందితో తెలుగులో తొలి హిట్‌ అందుకుంది. అయితే తర్వాత రెండు పరాజయాలు వెక్కిరించాయి. రీతూ బర్మేచ అహనా పెళ్లంటతో హిట్‌ అందుకున్నా.. అవకాశాలే వెంటరాలేదు. అక్ష అడపాదడపా నటిస్తున్నా..ఎట్టకేలకు కందిరీగతో విజయం అందుకుని ఖుషీ అయింది. తదుపరి చిత్రాలకు సంతకాలు చేయడానికి సిద్ధమవుతోంది. బియాంక దేశాయ్‌, రితూబర్మేచ, సుమ భట్టాచార్య, కృతి కర్బంద, ప్రియా ఆనంద్‌, సారాజేన్‌‌‌, అంజలి లవానియా, ప్రీతికారావ్‌ ..ఇలా కొత్త హీరోయిన్లు సినిమాలోకి ప్రవేశించారు. అయితే వీరిలో శృతిహాసన్‌, నిత్యామీనన్‌, అమలాపాల్‌ మాత్రమే డిపాజిట్లు దక్కిన తారలుగా ఐడెంటిటీ తెచ్చుకున్నారు.

నయనతార కెరీర్‌కి చివరి చిత్రంగా పేర్కొంటున్న శ్రీరామరాజ్యం హిట్‌ చిత్రంగా నిలవడమేగాక తనకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఛార్మి, ప్రియమణిలు ఏ మాత్రం తమ ప్రభావం చూపలేక చతికిలపడ్డారు. కమలిని ముఖర్జీ నటించిన ఒకే ఒక్క చిత్రం విరోధి ఫ్లాపయింది. ఇక దీక్షాసేథ్‌ మిరపకాయ్‌తో హిట్‌ అందుకుని, వాంటెడ్‌తో పరాజయం పాలయింది. తాప్సీకి వీర కాస్త ఊరటనివ్వగా ఎన్నో ఆశలు పెట్టుకున్న మొగుడు బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడింది.

మిరపకాయ్ తో విజయం అందుకున్న రిచా గొంగోపాథ్యాయ్‌, దీక్షాసేత్‌ లు తమిళపరిశ్రమలో ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తున్నారు. సీనియర్‌ కథానాయికల్లో.. ఇలియానా నటించిన శక్తి, నేను నా రాక్షసి రెండూ నిరాశపరిచాయి. త్రిష నటించిన ఒకే ఒక్క చిత్రం తీన్‌మార్‌ విజయం దక్కించుకోలేకపోయింది. కాజల్‌ నటించిన చిత్రాలలో 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' పెద్ద విజయం అందుకుంది. వీర ఫర్వాలేదనిపించుకుంది.

తమన్నా చాలా గ్యాప్‌ తర్వాత నటించిన '100% లవ్‌' చిత్రం హిట్‌ చిత్రంగా నిలిచింది. అయితే భద్రినాధ్, ఊసరవెల్లి చిత్రాలు కలెక్షన్ల పరంగా యావరేజ్‌గా నిలిచాయి. చాలా కాలం తర్వాత నటించిన హన్సిక చిత్రం కందిరీగ హిట్‌ చిత్రంగా నిలిచింది. ఓ మై ఫ్రెండ్ యావరేజ్‌ అనిపించుకుంది. జెనీలియా ఈ సంవత్సరం బోణీయే చేయలేదు. డబ్బింగ్‌ చిత్రాలతో సరిపెట్టేసుకుంది. గతేడాది హవా నడిపించిన సమంత దూకుడుతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. అనుష్క ఈ సంవత్సరం డబ్బింగ్‌ చిత్రంతోనే సరిపెట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X