»   » ఐఫా ఉత్సవంలో హీరోయిన్లు హాట్ హాట్ (ఫోటోస్)

ఐఫా ఉత్సవంలో హీరోయిన్లు హాట్ హాట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ సినీ పరిశ్రమలో తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఐఫా అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ అవార్డుల వేడుకలో తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ హాజరై సందడి చేసారు.

హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఔట్‌డోర్ స్డేడియంలో అట్టహాసంగా ఈ వేడుకలు జరిగాయి. మొదటి రోజు తమిళ, మలయాళ సినిమాల అవార్డు ప్రదానోత్సవం జరగగా, నిన్న సాయంత్రం తెలుగు, కన్నడ భాషలకు సంబందించిన అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ వేడుకకి తెలుగు చిత్ర సీమలోని స్టార్ హీరోస్ అందరూ హాజరయ్యారు.

తెలుగు చిత్ర సీమ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ మొదలిన వారు హాజరయ్యి ఈ వేడుకకి స్టార్ అట్రాక్షన్ తెచ్చారు. అలాగే రామ్ చరణ్, అఖిల్, తమన్నాలు లైవ్ పెర్ఫార్మన్స్ తో భీభత్సంగా శ్రోతలను ఆకట్టుకున్నారు. ఈ వేడుకకి అల్లు శిరీష్ - రెజీనలు హోస్ట్ లుగా వ్యవహరించారు. ఈ వేడుకల్లో బెస్ట్ హీరోగా మహేష్ బాబు ఎంపిక కాగా, బెస్ట్ హీరోయిన్ గా శృతి హాసన్ ఎంపికైంది. ఈ వేడుకల ద్వారా సేకరించిన మొత్తాన్ని ఇటీవల చెన్నైలో వచ్చిన తుపాను బాధితులకు అందజేయనున్నారు. కోటి రూపాయలు పైనే విరాళం సేకరించినట్లు సమాచారం.

ఈ వేడుకలో పలువురు తారామణులు ప్రత్యేక వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. హాట్ అండ్ సెక్సీ లుక్ తో తళుక్కుమన్నారు. శృతి హాసన్, రెజీనా, తమన్నా, శ్రీయ, లావణ్య త్రిపాఠి, రాశి ఖన్నా తదితరులు సూపర్ హాట్ లుక్ తో ఆకట్టుకున్నారు.

స్లైడ్ షోలో ఐఫా ఉత్సవంలో హీరోయిన్ల హాట్ హాట్ లుక్....

శృతి హాసన్

శృతి హాసన్

బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్న శృతి అందం విషయంలోనూ బెస్ట్ అని నిరూపించుకుంది.

సూపర్ హాట్

సూపర్ హాట్

ఐఫా వేడుకలో శృతి హాసన్ హాట్ లుక్ చూసి ఫ్యాన్స్ మైమరిచిపోయారు.

రెజీనా

రెజీనా

ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులో రెజీనా అదరగొట్టింది.

బ్యాక్ అందాలు

బ్యాక్ అందాలు

బ్యాక్ లెస్ అందాలతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది.

శృతి

శృతి

ఉత్తమ నటిగా తనకు అవార్డు దక్కడంతో చాలా హ్యాపీగా కనిపించింది శృతి.

అందాల రాశి

అందాల రాశి

అందం విషయంలో తానేమీ తక్కువ కాదు అని నిరూపించుకుంది రాశి ఖన్నా.

రకుల్

రకుల్

ఐఫా వేడుకలో రకుల్ ప్రీత్ సింగ్

లావణ్య

లావణ్య

ఐఫా వేడుకలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి

శ్రీయ

శ్రీయ

ఐఫా వేడుకలో హీరోయిన్ శ్రీయ

తమన్నా

తమన్నా

ఐఫా వేడుకలో హీరోయిన్ తమన్నా

English summary
Heroines hot look at IIFA Utsavam Green Carpet held at Hyderabad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu