twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్క ఛాన్స్‌..ఒకే ఒక్క ఛాన్స్‌

    By Staff
    |

    ఒక్క ఛాన్స్‌..ఒకే ఒక్క ఛాన్స్‌ అంటూ తాపత్రయపడే హీరోయిన్లు ఒక్క సినిమా హిట్టయితే చాలు నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. నిర్మాతలు కూడా ఆ హీరోయినే కావాలి అని ప్రెస్టేజికి పోయి వారికి డిమాండ్‌ పెంచేస్తున్నారు. సదరు హీరోయిన్లు డిమాండ్‌ పెరగడంతో పారితోషికం కూడా పెంచేసి 'కోటి" క్లబ్‌లో చేరిపోవాలని ఉబలాటపడుతున్నారు. ప్రస్తుతం అనుష్క, ఇలియానా, జెనీలియా ఈ 'కోటి క్లబ్‌"లో మెంబర్స్‌గా చేరిపోయారని, అతి దగ్గరలో త్రిష, నయనతార, శ్రీయ, హన్సికలు వున్నారని తాజా సమాచారం. దీపం వుండగా ఇల్లు చక్కబెట్టుకోవాలని హీరోయిన్లు..క్రేజ్‌ వుండగానే సొమ్ము చేసుకోవాలని నిర్మాతలు బడ్జెట్‌ పెంచేసి తర్వాత బిజినెస్‌ జరగక లబో దిబో మంటున్నారు. పాత తరం హీరోలుగాని హీరోయిన్లు గాని ఇలా పారితోషికాలు పెంచేసిన దాఖలాలు ఎక్కడ వెతికినా కనిపించవు.

    అందుకే అప్పటి నిర్మాతలు చేతులు కాల్చుకున్న దాఖలాలూ కనిపించవు. కమిట్‌మెంట్‌తో తప్ప కాసులకోసం సినిమాలు చేసేవారు కాదు. సో..'కోటి" తారలు అంటే ఆషామాషీ కాదు సుమా ఫలానా నిర్మాత ఫలానా హీరోయిన్‌కు కోటి రూపాయలు ఇచ్చారు అంటే మరో నిర్మాత నేను కోటిన్నర ఇస్తాను అని ముందుకు వచ్చి కాల్షీట్లు ఎగరేసుకుపోతారు. 'మల్లీశ్వరి" చిత్రంలో నటించినందుకు గాను కత్రినా కైఫ్‌కు నిర్మాత కోటి రూపాయలిచ్చారు అనే వార్త ఫిలింనగర్‌లో వినిపించి రాష్ట్ర వ్యాప్తంగా 'సై్వన్‌ ఫ్లూ" లా వ్యాపించింది. అదలా వుంచితే...ధర తగ్గితే డిమాండ్‌ పెరుగుతుంది. ధర పెరిగితే డిమాండ్‌ తగ్గుతుంది". ఇది డిమాండ్‌ సూత్రం. 'ధర పెరిగితే డిమాండ్‌ పెరుగుతుంది. ధర తగ్గితే డిమాండ్‌ తగ్గుతుంది". దీనిని గిఫెన్‌ వైపరీత్యం అంటారు. దీనిని గిఫెన్‌ అనే అర్ధశాస్తవ్రేత్త చెప్పారు. అంటే ఖరీదైన వస్తువులను వాడటం వలన సమాజంలో విలువ ఈ గిఫెన్‌ వైపరీత్యం ఇప్పుడు మన హీరోయిన్లకు సరిగ్గా సరిపోతుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X