బొడ్డుతో క్లీన్ బోల్డ్ చేస్తున్న తారలు!
ఇటీవలి కాలంలో టాలీవుడ్ మాత్రమే కాకుండా అన్ని చిత్ర పరిశ్రమల్లో ఎక్స్‌పోజింగ్ శృతిమించింది. అశ్లీలంగా నటించేందుకు ప్రధాన హీరోయిన్లు సైతం పోటీ పడుతున్నారు.బొడ్డును ఎక్స్ పోజ్ చేయడం కామనైపోయింది ..రసికులైన సినిమా దర్శకులంతా హీరోయిన్ల నాభి అందాలను ప్రదర్శించడంలో తమ క్రియేటివిటీ ఉపయోగిస్తున్నారు..లోగడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన “ఖుషి" చిత్రంలో భూమిక తన నాభీ అందాన్ని ప్రదర్శించి ఈ చిత్రం తిలకించేందుకు వచ్చిన ప్రేక్షకులను ఖుషి చేసింది. ఈ చిత్రంలో భూమిక బొడ్డు అందాన్ని చూసిన మహిళా లోకమే ఈర్ష్యపడిందనే గుసగుసలూ లేకపోలేదు. అప్పటి నుంచి అడపాదడపా హీరోయిన్ల బొడ్డు అందాలను చూపించేందుకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన దర్శకులు…. ఈ మధ్య కాలంలో మాత్రం మరీ ఎక్కువైపోయింది. అది ఎంతగా అంటే.. వక్షోజాలు ఎక్స్‌పోజింగ్ చేసినా నాభి చూస్తేనే సగటు ప్రేక్షకుడు ఫ్లాట్ అయిపోతున్నారట. ఇది దర్శకుల మాటే సుమా.
అందుకే కుర్ర హీరోయిన్లు ఇలియానా, అనుష్క, ప్రియమణి, ఛార్మి, తమన్నా, తాప్సీ, దీక్షాసేథ్ లాంటివారు తమ నాభి అందాలను వివిధ కోణాల్లో ప్రదర్శించేందుకు పోటీ పడుతున్నారు. ఇలా ప్రదర్శించడం పెద్ద విషయం కాదని వారే సెలవిస్తున్నారు. మరికొంతమంది డైటింగ్ పేరుతో తమ నడుమును తగ్గించుకుని జీరో సైజు వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు సావిత్రి, జమున, కృష్ణకుమారి, బి.సరోజ లాంటి ఎందరో సహజ అందాల నటీమణులు బ్లాక్ అండ్ వైట్ శకంలో కేవలం తమ ముఖంలోని హావభావాల ద్వారా మాత్రమే శృంగారాన్ని చాటేవారు తప్ప శరీర అందాలను ఎంతమాత్రం బహిర్గతం చేసేవారు కాదు. అయితే ఇప్పటి హీరోయిన్లు బొడ్డు అందాలను బాహాటంగా చూపించేస్తూ ప్రేక్షకులను కవ్విస్తున్నారు. అంతే కాదు సమంత లాంటి హీరోయిన్లు ఆ బొడ్డుకు ఆభరణాలు ధరించి మరీ పబ్లిక్ లో షో చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











