నాతో చేసాకే హీరోయిన్స్ కు వెలుగు మొదలైంది
నా అభిమాన హీరోయిన్ అంటూ ఎవరూ లేరు. 'ప్రేమ" చిత్రంలో రేవతితో నా జోడీ బాగా కుదిరిందని ఇప్పటికీ చెబుతుంటారు. సౌందర్య, మీనా కూడా నాతో చాలా సినిమాలు చేశారు. ఆనందం కలిగించే విషయం ఏమిటంటే దివ్యభారతి, టబు, ప్రీతి జింతా,కత్రినాకైఫ్… వీళ్లంతా నాతో నటించాకనే బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారు అన్నారు వెంకటేష్. అలాగే హీరోల గురించి చెబుతూ.. మా జనరేషన్ హీరోలు ఇప్పుడు ఒకటి, రెండు సినిమాలు చేసినా ఫర్వాలేదు కానీ, ఈ జనరేషన్ హీరోలు మాత్రం ఎక్కువ సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ చేయగలిగితేనే కొత్త కొత్త కాన్సెప్ట్‌లు పుట్టుకొస్తాయి. హీరోలు 45 మంది ఉంటే, హీరోయిన్లు 10 మంది మాత్రమే ఉన్నారు. ఇక ఆయన తాజా చిత్రం నాగవల్లి..ఓపినింగ్స్ అధిరిపోయే రేంజిలో ఉన్నా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
వెంకటేష్ చంద్రముఖి నాగవల్లి దివ్యభారతి టబు ప్రీతి జింతా కత్రినాకైఫ్ venkatesh chandramuki nagamalli divya bharathi tabu prithi jintha karthina kaif


Click it and Unblock the Notifications