హీరోయిన్లు ఇలా కూడా సంపాదిస్తున్నారండోయ్
ఒక్కసారి హీరోయిన్ గా తెరపై తళుక్కుమంటే వాళ్ల దశ తిరిగినట్లే. ఇక ఒకటో రెండో హిట్ సినిమాలు వాళ్ల ఖాతాలో ఉంటే వాళ్లకి తిరుగే ఉండదు. వాణిజ్య ప్రకటనలు, షాపుల ఓపెనింగులు, ర్యాంపువాక్ లు ఇలా సంపాదించుకునేందుకు చాలా దారులు కథానాయికల కోసం తెరుచుకుంటాయి. ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోయినా....ఈ రూట్లలో సంపాదిస్తూ కాలం గడిపేస్తుంటారు. గతంలో ఎక్కడ ర్యాంపుషోలు జరిగినా మోడల్స్ మాత్రమే కనిపించే వారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారి పోయింది. వారి స్థానాని సినిమా అవకాశాలు తగ్గిపోయిన తారలు ఆక్రమిస్తున్నారు.
తాజాగా ముంబైలో జరిగిన నగల ఫ్యాషన్ షోలో బాలీవుడు సుందరాంగులు తళుక్కుమన్నారు. ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ హేమామాలినితో పాటు జన్నత్ ఫేం సోనాల్ ఛౌహాన్, మహిమా చౌదరి, అమృతరావు తదిరులు హొయలొలికించి ఆకట్టుకున్నారు. ఈ తారలంతా ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేని వారే కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











