కనితన్ రీమేక్ లో నటిస్తున్న నిఖిల్
ఇటీవల కిరాక్ పార్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ ప్రస్తుతం తమిళ సినిమా కణితన్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఒరిజినల్ ను తెరకెక్కించిన టిఎన్ సంతోష్ తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలోని పూర్తి కథను కాకుండా.. కేవలం లైన్ మాత్రమే తీసుకుని ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తెరకేక్కిస్తుండడం విశేషం.

ఈ సినిమా రవితేజ చెయ్యాలి అనుకున్నాడు
ఈ సినిమాను ముందు రవితేజతో రీమేక్ చేయాలని భావించాడు దర్శకుడు సంతోష్. ముందుగా రవితేజ కూడా ఈ సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపించడం జరిగింది. కాని కొన్ని అనివార్య కారణాలవల్ల అది కుదరలేదు. అనుకోకుండా నిఖిల్ వచ్చాడు ఈ ప్రాజెక్ట్ లోకి. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు.

నిఖిల్ పక్కన నటించడానికి ఒప్పుకొని హీరోయిన్స్
ఈ సినిమాకు ముద్ర అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఈ టైటిల్ ను రిజిష్టర్ కూడా చేయించాడు ఠాగూర్ మధు. ఈ సినిమా షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తి అయినా ఇంతవరుకు హీరోయిన్ ఖరారు కాకపోవడం అందరిని ఆచర్యానికి గురి చేస్తుంది. రస్మిక, క్యాథరిన్, శాలిని పండే, హన్సిక ఈ సినిమా చెయ్యమని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. చివరికి ఏహీరోయిన్ నిఖిల్ తో చేస్తుందో చూడాలి.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారి ధరకు
ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ను ఓ లీడింగ్ ఛానెల్ 5.50 కోట్లకు దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. నిఖిల్ కెరీర్ లో ఇదే హైయ్యస్ట్ రేట్. ఈ మద్య సినిమాను హైప్ లేపడం కోసం ఫేక్ రేట్స్ క్రియేట్ చేస్తున్నారు కావున ఈ న్యూస్ లో నిజం ఎంతుందో తెలియదు. కిరాక్ పార్టి సినిమా నిఖిల్ కు ఆశించిన స్థాయి విజయం అందించలేదు. మరి ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Click it and Unblock the Notifications