»   » పొట్టి స్కర్టులో హాట్ హాట్‌గా హీరోయిన్ (ఫొటో ఫీచర్)

పొట్టి స్కర్టులో హాట్ హాట్‌గా హీరోయిన్ (ఫొటో ఫీచర్)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై : చెప్పేది ఒకటి...చూపేది ఒకటి అనేది సినిమా వారి నైజం. ఎంటర్టైన్మెంట్ బిజినెస్ లో ఉన్న హీరోయిన్స్ తాము అశ్లీలతకు,చివరకు ముద్దుకు కూడా దూరం అంటూనే తమ అందాలు ఆశ్చర్యపోయేలా ఆరబోసేస్తూంటారు. తాజాగా అలాంటి పనే చేసింది కృతి సనన్. ఆమె చెప్పే నీతి వాక్యాలకు, చేసే చేష్టలకు సంభంధం లేదంటున్నారు.

  '1' - నేనొక్కడినే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కృతిసనన్‌. బాలీవుడ్‌లో 'హీరో పంటి' చిత్రంలో అవకాశం అందుకొంది. అల్లు అర్జున్‌ నటించిన 'పరుగు'కి ఇది రీమేక్‌. జాకీష్రాఫ్‌ తనయుడు టైగర్‌ ష్రాఫ్‌ కథానాయకుడు. షబ్బీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో ఓ ఘాటైన ముద్దు సన్నివేశం ఉందట. టైగర్‌ - కృతిల మధ్య సాగే ఆ సుదీర్ఘమైన అధర చుంబనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

  ముద్దు గురించి కృతి మాట్లాడుతూ.. ''ఇందులో లిప్‌లాక్‌ సన్నివేశం ఉందని దర్శకుడు నాకు ముందే చెప్పారు. 'ఆ సన్నివేశం పక్కన పెట్టొచ్చు కదా?' అని అడిగా. కానీ 'కథలో ఆ ముద్దుకూడా భాగమే..' అని సందర్భం వివరించారు. ఇక ఆ ముద్దు వద్దని చెప్పలేకపోయా. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చా. మా ఇంటి పద్ధతులు నాకు తెలుసు. అయితే.. అమ్మానాన్న ఇచ్చిన ప్రోత్సాహంతోనే పరిశ్రమలోకి వచ్చా. నేను ఒక్క అడుగు ముందుకేసినా వాళ్ల గురించే ఆలోచిస్తా. ఇంట్లోవాళ్లకు తలవొంపులు తెచ్చే పనులు చేయను..'' అంటోంది.

  తాజా ఫొటో షూట్ ఫొటోలు స్లైడ్ షోలో...

  అందుకే బాలీవుడ్ వైపు...

  అందుకే బాలీవుడ్ వైపు...

  మహేష్ బాబు '1' చిత్రంలో హీరోయిన్ గా కృతి సనన్ పరిచయ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కృతిసనన్‌ టీవీ న్యూస్‌ రీడర్‌గా పని చేస్తూ కనిపించి, తన గ్లామర్ తో ఆకట్టుకుంది. అయితే '1' చిత్రం ఆశించిన మేరకు విజయం సాధించకపోవటంతో ఆమెకు ఊహించని విధంగా ఆపర్స్ రాలేదు. దాంతో ఇలా బాలీవుడ్ వైపు ప్రయాణం పెట్టుకుంది.

  ఇప్పుడు మళ్లీ..

  ఇప్పుడు మళ్లీ..

  వచ్చిన చిన్న చిన్న ఆఫర్స్ ని ఆమె రిజక్టు చేసింది. అయితే ఆమె అలా రిజక్టు చేయటమే కలిసివచ్చిందంటున్నారు. ఆమె ఇప్పుడు అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో ఆమెను ఎంపిక చేసారు. ఈ చిత్రంలో ఆమె ఫుల్ బిజీ అవుతానని భావిస్తోంది. ఆ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా ఇప్పటికే సమంతను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

  మొదట్లో...

  మొదట్లో...

  ఈ ముంబై ముద్దుగుమ్మ మొదట ఇంజినీర్‌ కావాలనుకుంది. కాలేజీకెళ్లే టైమ్‌లో నే కొన్ని టీవీ ప్రకటనల్లో కనిపించింది.

  మోడలింగ్ ద్వారా

  మోడలింగ్ ద్వారా


  ఆ తర్వాత మోడలింగ్‌ ని ప్రొఫెషన్ గా తీసుకుంది. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు రావటం మొదలెట్టింది. చాలాకాలం అది కంటిన్యూ చేసింది

  అదే మొదటి మలుపు..

  అదే మొదటి మలుపు..

  ఈ లోగా ఆమె ఊహించని విధంగా ఫేమస్‌ ఫోటోగ్రాఫర్‌ డబూ రత్నానీ దృష్టిలో పడింది. ఓ పెద్ద ఫోటోషూట్‌. అదే ఆమె జీవితాన్ని మార్చేసింది.

  సినిమావాళ్ల దృష్టిలో..

  సినిమావాళ్ల దృష్టిలో..

  ఫోటోషూట్ తో ఒక్కసారిగా కృతి పేరు ముంబై ఫిలింసర్కిల్స్‌లో మార్మోగిపోయింది. దాంతో వరుసగా బాలీవుడ్‌లో పిలుపులు వచ్చాయి.

  అదీ వర్కవుట్ కాలేదు

  అదీ వర్కవుట్ కాలేదు

  ఫొటో షూట్ తో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లో ... ఓ సినిమాకి కూడా కమిట్‌ అయ్యింది. అయితే అది అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. దాంతో నిరాసలో పడిపోయింది.

  మహేష్ ఛాన్స్ అలా..

  మహేష్ ఛాన్స్ అలా..

  సరిగ్గా అదే సమయంలో మహేష్‌ సినిమా కోసం ఆడిషన్స్‌ జరుగుతున్నాయని వింది. అంతే వెంటనే హైదరాబాద్‌ వచ్చింది. ఆడిషన్స్‌లో దర్శకనిర్మాతల్ని, హీరోని మెప్పించింది. ఇంకేముంది. ‘1 నేనొక్కిడినే ' హీరోయిన్ గా ఫిక్సయిపోయింది.

  హాట్ టాపిక్..

  హాట్ టాపిక్..

  తెలుగు పరిశ్రమలోనే మెగాబడ్జెట్‌ సినిమాలో నటించి హాట్‌ టాపిక్‌ అయిపోయింది. అయితే ఆ సినిమా విజయం సాధించకపోవటంతో ఆమె నిరాశపడిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ అల్లు అర్జన్ చిత్రంతో ఫామ్ లోకి వస్తానని భావిస్తోంది.

  అటూ..ఇటూ

  అటూ..ఇటూ

  ఇక ఈ సారి అలాంటి సమస్యలు రాకుండా అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ రెండింటిలోనూ ఎడాపెడా నటించాలని నిర్ణయించుకుంది. దాంతో ఎక్కడో చోట క్లిక్ అయ్యి ఫుల్ బిజీగా ఉండవచ్చని భావిస్తోంది.

  English summary
  Kriti Sanon said.. "I come from a conservative family, but my parents took it in a positive way and they supported me with each and every decision of mine," she added.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more