భోళా శంకర్ కు ఎదురుగా 4 సినిమాలు.. ఆ వారం బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వడం పక్కా!
బాక్సాఫీస్ వద్ద వరుసగా కొన్నిసార్లు పెద్ద హీరోల మధ్యలో కూడా పోటీ తప్పడం లేదు. అయితే కంటెంట్ బాగుంటే మాత్రం పండగ సీజన్స్ లో అన్ని సినిమాలు మంచి కలెక్షన్స్ అందుకుంటు ఉంటాయి. ఇక ఈసారి ఆగస్టు నెలలో కూడా ఆసక్తికరమైన పోరు కనిపించబోతోంది.
ఆగస్టు మొదటివారం అనంతరం వరసగా హాలిడేస్ ఉండడంతో పెద్ద హీరోలు సినిమాలో గ్రాండ్ గా విడుదల కాబోతున్నాయి. అలాగే మరో మూడు సినిమాలు కూడా వాటి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఇక ఈ క్రమంలో భోళా శంకర్ గట్టి పోటీని ఎదుర్కోబోతున్నాడు. ఇక. ఈ పోటీలో ఏ ఏ సినిమాలు హైలెట్ కాబోతున్నాయి అనే వివరాల్లోకి వెళితే..

మాస్ మూవీగా రానున్న భోళా శంకర్: మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య సక్సెస్ తర్వాత వెంటనే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ మూవీ రెడీ చేసేందుకు స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వేదాళం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఆవిష్కరుస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీని ఆగష్టు 11న రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. ఇప్పటికే డేట్ కూడా కన్ఫర్మ్ అయ్యింది.

మెగాస్టార్ కు పోటీగా సూపర్ స్టార్: ఇదిలా ఉంటే ఇండిపెండెంట్స్ డే సందర్భంగా ఆగష్టు 10, 11 తేదీలలో ఈ సారి సిల్వర్ స్క్రీన్ పై గట్టి పోటీ ఉండబోతోంది. భోళా శంకర్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు కాబట్టి మంచి బజ్ ఉంటుంది. అయితే దీనికి పోటీగా సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ఆగష్టు 10న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

స్పెషల్ బజ్ తో రానున్న ఎనిమల్: ఈ సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ఎనిమల్ ఆగష్టు 11న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా తెలుగులో కూడా మంచి బజ్ క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా సందీప్ ఈ సినిమాతో ఒక డిఫరెంట్ బజ్ క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

డీజే టిల్లు సీక్వెల్: అలాగే తెలుగులో మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న టిల్లు స్క్వేర్ మూవీ కూడా అదే టైమ్ లో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు.డీజే టిల్లు హిట్ కావడంతో ఇప్పుడు సీక్వెల్ పై హైప్ క్రియేట్ అయ్యి ఉంది. దీంతో పాటు తమిళంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతోన్న మావీరన్ మూవీ కూడా తెలుగులో మహావీరుడు టైటిల్ లో అదే రోజు రిలీజ్ కానుంది.
ఏ సినిమా హిట్ అవుతుందో: మొత్తానికి ఇండిపెండెంట్స్ ట్రీట్ గా తెలుగులో రెండు సినిమాలు, తమిళం నుంచి రెండు పాన్ సినిమాలు, హిందీ నుంచి ఒక మూవీ సిల్వర్ స్క్రీన్ పై పోటీ పడబోతున్నాయి. వీటన్నింటికి కూడా తెలుగునాట అయితే బజ్ గట్టిగానే ఉంటుంది. మరి వీటిలో ఈ మూవీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది అనేది వేచి చూడాలి. జైలర్ సినిమాలో టాలీవుడ్ నుంచి సునీల్, నాగబాబు నటిస్తున్నారు. అలాగే తమన్నా కూడా లీడింగ్ లో నటిస్తున్నారు. కాబట్టి ఈ మూవీపై ఎక్కువ హైప్ ఉండే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











