twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్, సెన్సేషన్ డైరెక్టర్ రాజమౌళిల ఫాంటసీ చిత్రం ప్రెస్ మీట్ విశేషాలు...?

    By Sindhu
    |

    ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ఫ్యాంటసీ కథా చిత్రం రూపొందనుంది. కె.రాఘవేంద్ర రావు సమర్పణలో ఆర్కా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీనిని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విశేషాలను ఈరోజు (ఫిబ్రవరి 18) ఉదయం హైదరాబాదులోని సినీ మేక్స్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వివరించారు. దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, 'నా కెరీర్ ప్రారంభమైంది రాఘవేంద్ర రావు గారి వద్దే. 'ఘరానా బుల్లోడు' సినిమా కి తొలిసారిగా వర్క్ చేసాను. ఆ తర్వాత పలు సినిమాలకు పని చేసాను. అంటే, ఇది నా సొంత బ్యానర్ లాంటిది.

    అలాగే, ప్రభాస్ తో 'ఛత్రపతి' తర్వాత చేస్తున్న సినిమా ఇది. కథ ఇంకా పక్కాగా తయారవ్వలేదు. అయితే, ఓ లైన్ అనుకున్నాను. ఫుల్ ఫ్యాంటసీ సినిమా అవుతుంది. ఆ విధంగా నా కోరిక తీరుస్తుంది. సెప్టెంబర్ లో సెట్స్ కి వెళతాం. మొత్తం పూర్తవడానికి ఓ ఏడాది పడుతుంది. బడ్జెట్ పరంగా చాలా పెద్దది. 'మగధీర' కంటే ఎక్కువ అవుతుంది. అందుకే, తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్నాం. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వుంటాయి. వినోదాన్ని కోరుకునే వారికి విందు భోజనం లాంటి సినిమా అవుతుంది" అన్నారు. హీరో ప్రభాస్ మాట్లాడుతూ, "మా నాన్న గారికి రాఘవేంద్ర రావు గారు మంచి మిత్రులు.

    అలాగే పెదనాన్నకు కూడా! ఆయనకు 'బొబ్బిలి బ్రహ్మన్న' వంటి పెద్ద హిట్ ఇచ్చారు. రెండేళ్ల నుంచి అనుకుంటున్నాం, ఈ సినిమా చేయాలని. ఇప్పటికి కుదిరింది. ఇలాంటి సినిమా మళ్లీ నా కెరీర్ లో వస్తుందో, రాదో తెలియదు. అంతటి స్పాన్ వున్న సినిమా ఇది" అన్నాడు. ఇంకా ఈ కార్యక్రమంలో కీరవాణి, ఎడిటర్ రవీందర్, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు.

    English summary
    It is already reported that sensation director SS Rajamouli is planning to make a film with Young Rebel Star Prabhas. 
 
 The latest buzz about this project is that Darsakendra K Raghavender Rao is going to producer the film. Also, it is 
 
 learnt that it would be a high budget flick. Details of this big flick will be announced soon. Earlier, Rajamouli and 
 
 Prabhas teamed up for the blockbuster ‘Chatrapathi.’ It is one of the biggest hits in Prabhas’ career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X