Bigg Boss Telugu 7 నాగార్జునను అరెస్ట్ చేయండి.. బిగ్‌బాస్ షోపై హైకోర్టులో కేసు.. విధ్వంసానికి బాధ్యులు మీరే..

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ ప్రశాంతంగా ముగిసింది. అయితే బిగ్‌బాస్ తెలుగు ఫినాలే తర్వాత అల్లరి మూకలు చేసిన విధ్వంసంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు సెలబ్రిటీల కార్లను, అలాగే ఆర్టీసీ బస్సులపై దాడి చేసి ధ్వంసం చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియో అధినేత, హోస్ట్ నాగార్జున అక్కినేనిపై అడ్వకేట్ అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అడ్వకేట్ అరుణ్ కుమార్ చెప్పిన ఈ కేసు వివరాల్లోకి వె ళితే..

Recommended Video

Nagarjuna ను Arrest చేయండి Big Boss Telugu షోపై Highcourt లో Case.. | Telugu Filmibeat

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ ఫినాలే రోజున కొందరు సెలబ్రిటీల అభిమానులు ప్రభుత్వం ఆస్తులపై దాడికి పాల్పడ్డారు. సర్కార్ ఆస్తులపై జరిగిన నష్టంపై బిగ్‌బాస్ తెలుగు 7 నిర్వాహకులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఈ షోపై అనేక అభ్యంతరాలు ఉన్నాయి. వాటిని కోర్టు దృష్టికి తీసుకొస్తున్నాం అని అరుణ్ కుమార్ తెలిపారు.

High Court Advocate demands Nagarjuna Akkineni Arrest: Bigg Boss Telugu 7 Show in legal Trouble

బిగ్‌బాస్ తెలుగు 7 విజేత పల్లవి ప్రశాంత్ ఓ సాధారణ పౌరుడు. అతడి ప్రతిభతో విజేతగా నిలిచారు. అలాంటి వ్యక్తిపై కేసు ఎలా నమోదు చేస్తారు? ఆస్తుల నష్టానికి అతడేలా బాధ్యత వహిస్తాడు? దాదాపు 8 బస్సుల ధ్వంసం జరిగింది. ఆ నష్టం ఎవరు భర్తీ చేస్తారు? ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారు. ఇలాంటి సందర్భంలో 8 బస్సులను ధ్వంసం చేయడం బాధాకరం అని అరుణ్ కుమార్ చెప్పారు.

రియాలిటీ షో పేరుతో బిగ్‌బాస్ షోలో అమ్మాయిలను 100 రోజులు బంధించి ఈవెంట్ నిర్వహించడం అభ్యంతరం. ఈ విషయాలను మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త, మహిళా కమిషన్ చైర్మన్ ఫిర్యాదు చేస్తాను అని అరుణ్ కుమార్ తెలిపారు.

High Court Advocate demands Nagarjuna Akkineni Arrest: Bigg Boss Telugu 7 Show in legal Trouble

అయితే బిగ్‌బాస్ తెలుగు 7 ఫినాలే రోజున జరిగిన అల్లర్లు, అన్నపూర్ణ స్టూడియోలో అల్లరి మూకలు చేసిన సంఘటనలకు అక్కినేని నాగార్జున బాధ్యత వహించాలి. బస్సుల దాడి ఘటనలో అమాయకుడైన పల్లవి ప్రశాంత్‌పై కేసు ఎలా పెడుతారు? ఈ ఘటనకు కారణమైన నాగార్జున, బిగ్‌బాస్ నిర్వాహకులు ఎండెమాల్ షైన్ ఇండియా అరెస్ట్ చేయాలని అడ్వకేట్ అరుణ్ కుమార్ హైకోర్టుకు దాఖలు చేసిన డిమాండ్‌లో పేర్కొన్నట్టు తెలిసింది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X