»   » బాహుబలి.... పిల్ కొట్టేసిన హైకోర్టు

బాహుబలి.... పిల్ కొట్టేసిన హైకోర్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కితున్న ‘బాహుబలి' చిత్రంపై టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరకుగుతున్నాయని గురువారం పిల్‌(ప్రజా ప్రయోజనాల వాజ్యం) దాఖలైన సంగతి తెలిసిందే. నరసింహ రావు అనే వ్యక్తి ఈ పిల్ దాఖలు చేసారు. ఈ వాజ్యాన్ని హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

బాహుబలి టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఒక పథకం ప్రకారం సినిమాపై హైప్ పెంచారు, దీంతో అభిమానులు టికెట్ల కోసం గొడవలకు దిగుతున్నారు. గతంలో మగధీర చిత్రానికి సంబంధించి ఇదే విధంగా జరగడంతో ఏడుగురు మరణించారని, ఈ పరిణామాల నేపథ్యంలో ప్రేక్షకుల ప్రాణాలకు ప్రమాదం ఉండే అవకాశం ఉందని పిల్ లో పేర్కొన్నారు. ఈ తరుణంలో థియేటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రదర్శనను పరిమితం చేయాలని పిటీషన్లో పేర్కొన్నారు.


 High Court dismisses PIL on Baahubali

కాగా... ఈ రోజు విడుదలైన బాహుబలి సినిమా మంచి స్పందన వస్తోంది. అభిమానులు ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే క్రిటిక్స్ నుండి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. అయితే సినిమా తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉందని, గ్రాండ్ లుక్ ఉందని, హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉందని అందరూ ఒప్పుకుంటున్న మాట.

English summary
High Court dismisses PIL on Baahubali.
Please Wait while comments are loading...