twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా వివాదం-నిత్యానంద పిటీషన్‍‌పై స్పందించిన కోర్టు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వివాదాస్పద స్వామిజీ నిత్యానంద..తెలుగులో రూపొందుతున్న 'సత్యానంద' సినిమా విడుదల ఆపివేయాలని పెట్టుకున్న అభ్యర్థనను హైకోర్టు స్వీకరించింది. ఈ సినిమా విడుదల చేయాలా? వద్దా? అనే నిర్ణయాధికారం ఫిలింబోర్డులకు అప్పగించింది.

    ఈ మేరకు... నిత్యానంద అభ్యంతరాలను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సెన్సార్ వివైజ్డ్ బోర్డులను ఆదేశించింది. వారంలోగా కేంద్ర సెన్సార్ బోర్డుకు నివేదిక అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తన జీవితం ఆధారంగా తీసిన సత్యానంద సినిమాలో తన ప్రతిష్ట దెబ్బతినేలా సీన్లు ఉన్నాయని, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని నిత్యానంద తన పిటీషన్లో పేర్కొన్న విషయం తెలిసిందే.

    'స్వామి సత్యానంద' చిత్రానికి మదన్ పటేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలీ, రవి చేతన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, జీవా, గుండు హనుమంత రావు, గౌతం రాజు, చిత్రం శ్రీను, బొంబాయి నటి నేహ, ఇటలీ అందాల భామ అలోకి, జయలలిత, కవిత, శ్రద్ధ, విజయ వర్మ, జెమిని ఫణి, జెన్నీ, తిలక్ తదితరులు నటిస్తున్నారు.

    మాటలు-సాయి కృష్ణ; పాటలు-జి.వి.హెచ్.ప్రసాద్, భారతి బాబు. ఫోటోగ్రఫి-సుభాష్; ఎడిటింగ్-రాంబాబు; ఆర్ట్-నారాయణ; స్టిల్స్ - రంగా; కొరేయోగ్రఫి-మురళి, మదన్, హరిణి; ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్-నాగి రెడ్డి; నిర్మాతలు-జి.వి.హెచ్.ప్రసాద్, శ్రీమతి లక్ష్మి; సంగీతం, దర్శకత్వం-మదన్ పటేల్.

    English summary
    In a response to Swami Nityananda's petition, High Court ordered to review the film Satyananda. It also suggested to submit a report to central film certification board.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X