ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు,సంగీత దర్శకుడు చక్రవర్తిలకు హైకోర్టు నోటీసులు జారి చేసింది. హైదరాబాద్ లోని షేక్ పేటలో అత్యంత విలువైన 2.20 ఎకరాల భూమిని రికార్డింగ్,రీ-రికార్డింగ్,డబ్బింగ్,ఎడిటింగ్,అవుట్ డోర్ యూనిట్లు తదితరాల నిర్మాణానికి కేటాయించారని వాటికి బదులుగా అక్కడ వాణిజ్య సముదాయాన్ని నెలకొల్పటాన్ని సవాలు చేస్తూ టీఆర్ ఎస్ నేత టి.హరీష్ రావు పిటీషన్ వేసారు. జస్టిస్ టి.మీనాకుమారి,జస్టిస్ జి.భవాని ప్రసాద్ లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది.