‘మెంటల్ పోలీస్’ పేరు మార్చాలని హైకోర్టు ఆదేశం

By Bojja Kumar

హైదరాబాద్: శ్రీకాంత్‌ హీరోగా దాసరి అరుణాదేవి, అనగాని ఫిలింస్‌ సమర్పణలో రాజ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌, ఎ. సుబ్రమణ్యేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై సంయుక్తంగా రూపొందుతోన్న చిత్రం 'మెంటల్‌ పోలీసు'. అయితే ఈ చిత్రం టైటిల్ మీద కొంత కాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా టైటిల్ పోలీస్ డిపార్టుమెంటు పేరు చెడగొట్టేలా ఉందని పోలీస్ ఆఫీసర్ల అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రెసిడెంట్ వై.గోపిరెడ్డి ఈ విషయమై నోటీసులు కూడా జారీ చేసారు. అయితే సినిమా యూనిట్ నుండి ఎలాంటి స్పందన లేక పోవడంతో కోర్టులో కేసు వేసారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన హైకోర్టు.... వెంటనే సినిమా టైటిల్ మార్చాలని ఆదేశాలు జారీ చేసింది.

 High Court orders on 'Mental Police' film title

సినిమా టైటిల్ మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పోలీసుల సంఘం అధ్యక్షుడు గోపీ రెడ్డి మాట్లాడుతూ...' సమాజంలో పోలీస్ డిపార్టుమెంటు ఎంతో రెస్పాన్సబులిటీగా ఉంటోంది. మా జీవితాలను పనంగా పెట్టి ఉగ్రవాదులు, తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులతో పోరాడుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం న్యూయార్క్ పోలీసుల స్టాండర్డ్స్ ను అందుకునేలా ఎన్నో మార్పులు చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో సినిమాలకు అలాంటి టైటిల్స్ పెట్టడం వల్ల ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళతాయి' అన్నారు.

శ్రీకాంత్‌ హీరోగా దాసరి అరుణాదేవి, అనగాని ఫిలింస్‌ సమర్పణలో రాజ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌, ఎ. సుబ్రమణ్యేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై సంయుక్తంగా రూపొందుతోన్న చిత్రం 'మెంటల్‌ పోలీసు'. కరణం పి. బాబ్జీ దర్శకుడు. ప్రసాద్‌ దాసరి, వివి దుర్గాప్రసాద్‌ అనగాని నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: బుజ్జి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X