హిందూ వివాదం...పూనంపాండేపై కేసు కొట్టివేత

By Srikanya

బెంగళూరు: హిందూ ధార్మిక భావనలను దెబ్బతీసేలా ప్రవర్తించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి, రూపదర్శి పూనం పాండేపై ఇక్కడి మెజిస్ట్రేట్‌ కోర్టులో నమోదైన కేసును ధర్మాసనం కొట్టివేసింది. అర్థనగ్నంగా నిలబడి విష్ణువు చిత్రాన్ని ప్రదర్శించిన ఆమెపై నగరానికి చెందిన న్యాయవాది ఉమేష్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో కేసు వేశారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కేసు విచారణకు స్వయంగా హాజరు కావాలంటూ పూనం పాండేకు మెజిస్ట్రేట్‌ కోర్టు నోటీసు జారీ చేసింది. దీన్ని ప్రశ్నిస్తూ పూనంపాండే ఇక్కడి ఉన్నత న్యాయస్థానంలో అర్జీ వేసుకున్నారు. అందులోని అంశాలను పరిగణనలోకి తీసుకుని పూనం పాండేపై ఉన్న కేసును రద్దు చేస్తూ ధర్మాసనం ఆదేశాలిచ్చింది

బాలీవుడ్‌లో ‘నషా' చిత్రం తర్వాత వివాదాస్పద తార పూనమ్‌ పాండే తెలుగులో ‘మాలినీ అండ్‌ కో' చిత్రంలో నాయికగా నటిస్తున్నారు. ఇదివరకు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మనీషా ఫిలిమ్స్‌ సంస్థ చాలా కాలం తర్వాత ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వీరు కె. దర్శకత్వం వహిస్తున్నారు. పూనమ్‌ సరసన హీరోగా సమ్రాట్‌ చేస్తున్నారు.

High Court quashed warrant against Poonam Pandey

చిత్ర సమర్పకుడు కిశోర్‌ రాఠీ మాట్లాడుతూ ‘‘ఇది టెర్రరిజం నేపథ్యంలో రూపొందుతున్న రొమాంటిక్‌ ఫిల్మ్‌. మంచి పాటలతో పాటు నాలుగు ప్రధాన యాక్షన్‌ సన్నివేశాలున్నాయి. ఓ స్టార్‌ హీరో సినిమాకి ఎన్ని హంగులుంటాయో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి'' అన్నారు.

నిర్మాత మహేశ్‌ రాఠీ మాట్లాడుతూ ‘‘యువతను ఉర్రూతలూగించే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందిస్తున్నారు. ‘ఎవడు', ‘లెజెండ్‌' వంటి చిత్రాలకు పనిచేసిన సి. రాంప్రసాద్‌ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు'' అని చెప్పారు. పూనమ్‌ ఈ చిత్రంలో ఓ కొత్త డైమన్షన్‌లో కనిపిస్తుందని దర్శకుడు వీరు తెలిపారు.

‘‘మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన కిశోర్‌ రాఠీ కుమారుడు మిలన్‌ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఆయన ‘యమలీల'లో బాలనటుడిగా కనిపించారు. మిగిలిన రెండు పాటలను థాయిలాండ్‌లో చిత్రీకరిస్తాం.'' అని ఆయన చెప్పారు.

పూనమ్‌ మాట్లాడుతూ ‘‘తొలి సినిమా ‘నషా' తర్వాత ఏడాది గ్యాప్‌తో ఈ సినిమా చేస్తున్నాను. ఈ మధ్యలో నా వద్దకు చాలా స్ర్కిప్టులు వచ్చాయి కానీ, అవన్నీ ఒకే తీరుగా ఉండటంతో నచ్చలేదు. ‘మాలిని అండ్‌ కో' స్ర్కిప్ట్‌ అమేజింగ్‌గా అనిపించింది. వీరు చాలా స్పీడ్‌ డైరెక్టర్‌. ఒక్క రోజులో ఆరు సన్నివేశాలు తీసేశారు. నాకు తెలుగు తెలీకపోయినా సన్నివేశాలు అర్థమయ్యేలా చెప్పి, ఈజ్‌తో చేయించుకున్నారు. కేరళ మసాజ్‌ సెంటర్‌లో పనిచేసే అమ్మాయిగా నటిస్తున్నా'' అని చెప్పారు.

ఖుషీ, ఫరా, కావ్యాసింగ్‌, సాంబ, సోనాల్‌, జీవా, రవి కాలే, జెన్నీ తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, కళ: బాబ్జీ, ఫైట్స్‌: గణేశ్‌, అహ్మద్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X