‘వకీల్ సాబ్’ విషయంలో ఫ్యాన్స్ రిలాక్స్: హైకోర్టు తీర్పుతో ఆ పనులకు బ్రేక్.. టార్గెట్ పవన్ మూవీనే
లాక్‌డౌన్ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో వస్తున్న బడా చిత్రమే 'వకీల్ సాబ్'. సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఈ సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే విడుదల ఏర్పాట్లు కూడా భారీగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల స్పెషల్ షోలకు సైతం సన్నాహాలు జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయ స్థానం 'వకీల్ సాబ్' ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపే తీర్పు ఇచ్చింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్
చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన 'పింక్'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కించాడు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
యువ హీరోయిన్ కియా గ్లామరస్ ఫోటోషూట్

అమ్మాయిల కథ... లాయర్‌గా పోరాటానికి
మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలు అనుకోకుండా ఓ కేసులో చిక్కుకుని ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్లను కాపాడేందుకు లాయర్ అయిన పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. చివరిగా బాధిత యువతులను ఎలా కాపాడాడన్నదే చిత్ర కథ. ఇందులో అంజలి, నివేదా థామస్, అనన్యలు ఆ అమ్మాయిల పాత్రలను పోషించిన విషయం తెలిసిందే.

భారీగా విడుదల.. ఏర్పాట్లు చేస్తున్న ఫ్యాన్స్
లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన సినిమా కావడంతో 'వకీల్ సాబ్'పై భారీ బజ్ ఏర్పడింది. దీని కోసం మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకనుగుణంగానే డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ మొత్తం పెట్టి దీన్ని కొనుగోలు చేశారు. దీంతో అన్ని ఏరియాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

భారీ రెస్పాన్స్.. అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డ్
సాధారణంగా పవన్ కల్యాణ్ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో.. 'వకీల్ సాబ్'కు అంతకు మించిన స్పందన వస్తోంది. అందుకే అడ్వాన్స్ బుకింగ్ లైన్స్ ఓపెన్ అయిన గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. హైదరాబాద్‌లోనైతే ఏకంగా 110 షోలకు గానూ అన్నీ హౌస్‌ఫుల్ బోర్డులు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్స్‌కు పండుగలాంటి వార్త వచ్చింది.

ఎన్నికల వల్ల ‘వకీల్ సాబ్’ మూవీపై ప్రభావం
ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడో జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటీఫికేషన్ వెలువడింది. ఏప్రిల్ 8న పోలింగ్.. 10న వాటికి కౌంటింగ్ జరగనుంది. అవసరమైన చోట 9న రీపోలింగ్ కూడా నిర్వహించనున్నారు. సరిగ్గా ఇవి 'వకీల్ సాబ్' రిలీజ్ సమయంలోనే జరగనున్నాయి. దీంతో జనసైనికులు వాటిపై ఫోకస్ చేయాల్సిన పరిస్థితి. ఇది సినిమాపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
Recommended Video

‘వకీల్ సాబ్’పై ఫ్యాన్స్ రిలాక్స్.. తీర్పుతో బ్రేక్
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ మంగళవారం హైకోర్టు తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో పవన్ అభిమానులు రిలాక్స్ అయ్యారు. ఎన్నికల హడావిడి కారణంగా సినిమాకు దూరమయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇలా జరగడం వాళ్లలో జోష్‌ను నింపుతోంది. ఫలితంగా ఎన్నికల పనులకు బ్రేకిచ్చి.. 'వకీల్ సాబ్' రికార్డులపై టార్గెట్ పెట్టుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











