For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాగార్జున ఇంటి వద్ద ‘బిగ్ బాస్’ హైడ్రామా.. ఆడవాళ్లతో అనుచితంగా ప్రవర్తించారంటూ..

|

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం ఏదైనా ఉందా అంటే అది 'బిగ్ బాస్' అనే చెప్పుకోవాలి. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. త్వరలోనే మరో సీజన్‌ను ప్రారంభించబోతుంది. ఈ నేపథ్యంలో షో నిర్వహకులపై ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డి, సినీ నటి గాయత్రి గుప్తా సంచలన ఆరోపణలు చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కినేని నాగార్జునకూ ఈ ఎఫెక్ట్ తగిలింది. దీంతో ఆయన ఇంటి ముందు హైడ్రామా చోటు చేసుకుంది.

నాగ్ ఇంటి వద్ద హైడ్రామా

నాగ్ ఇంటి వద్ద హైడ్రామా

‘‘ఆడవాళ్లను కించపరిచే విధంగా ఉన్న ‘బిగ్ బాస్' షోను రద్దు చేయాలి. నాగార్జున కూడా వెంటనే ఈ షోను తప్పుకోవాలి. దీనిపై సాయంత్రంలోగా షో నిర్వహకులు ప్రకటన చేయాలి. అలా చేయని పక్షంలో నాగార్జున ఇంటిని ముట్టడిస్తాం'' అని ఉస్మానియా యూనివర్మిటీకి చెందిన విద్యార్థి సంఘాలు బుధవారం మధ్యాహ్నం ఓ ప్రకటనను విడుదల చేశాయి. అయితే, నాగ్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వారంతా ఆయన ఇంటి ముందుకు వచ్చారు. అయితే, అప్పటికే పోలీసులు అక్కడ భారీ స్థాయిలో మోహరించి ఉండడంతో విద్యార్థులను వెనక్కి పంపేశారు.

శ్వేతా రెడ్డి ఆరోపణలతో తెరపైకి..

శ్వేతా రెడ్డి ఆరోపణలతో తెరపైకి..

ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డి ‘బిగ్ బాస్' నిర్వహకులపై సంచలన ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. సీజన్ - 3కి తనను ఎంపిక చేశారని చెప్పిన ఆమె.. ఈ షోలో పాల్గొనాలంటే తమ బాస్‌ను సంతృప్తి పరచాలంటూ కొందరు తనను సంప్రదించారని శ్వేతా రెడ్డి ఆరోపించింది. అంతేకాదు, తర్వాత టీవీ డిబెట్‌లో సైతం కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.

గాయత్రి గుప్తా ఎంట్రీతో..

గాయత్రి గుప్తా ఎంట్రీతో..

‘ఫిదా' ఫేమ్ గాయత్రి గుప్తా ఎంటరవడంతో ఈ వ్యవహారం మరింత సంచలనం అయింది. ‘‘నన్ను సీజన్ -2 కోసం సెలెక్ట్ చేశారు. అయితే, నాతో షో నిర్వహకుల్లో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ షోలోకి వస్తున్నావు కదా.. మరి 100 రోజులు సెక్స్ లేకుండా ఉండగలవా.? నీ సెక్స్ లైఫ్‌ను ఎలా మేనేజ్ చేసుకుంటావు..? అంటూ ప్రశ్నించారు'' అంటూ ఆమె చెప్పడం సంచలనం అయింది.

ఇద్దరూ కలిసి ఫిర్యాదు

ఇద్దరూ కలిసి ఫిర్యాదు

శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లో ‘బిగ్ బాస్' నిర్వహకులపై ఫిర్యాదు చేశారు. తమతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ షోను పూర్తిగా నిషేదించాలని కూడా కోరారు. అలాగే కొందరు ఈ షోను రద్దు చేయాలని కోర్టును కూడా ఆశ్రయించారు.

 ‘బిగ్ బాస్'కు అనుకూలంగా కోర్టు...

‘బిగ్ బాస్'కు అనుకూలంగా కోర్టు...

పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను పరిశీలించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాలు గడువు ఇస్తూ కేసును వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. దీంతో ఈ షో జూలై 21 నుంచి ప్రారంభం కాబోతుంది.

English summary
Tollywood Senior Hero Akkineni Nagarjuna Host Bigg Boss Telugu season 3. This Show Starts In Few Days. In This Time Telugu Sensationsl Actor, Fidaa Fame Gayathri Gupta, Anchor Swetha Reddy Share Few Statements opposite Bigg Boss Telugu.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more