ఈ సమ్మర్ కి జూ ఎన్టీఆర్ రికార్డుల మోత మోయించడం ఖాయం..!
గత ఏడాది వేసవిలో బాలకృష్ణ నందమూరి అభిమానులని ఎంతగా ఆనందపెట్టాడో, ఈ వేసవిలో జూ ఎన్టీఆర్ అంతగా నిరాశపరిచాడు. సింహా విజయాన్ని రిపీట్ చేస్తుందని ఆశిస్తే శక్తి కాస్తా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. అయితే వచ్చే వేసవికి మాత్రం జూ ఎన్టీఆర్ అభిమానుల్ని డిజప్పాయింట్ చేయననే అంటున్నాడు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న దమ్ము సినిమా అద్భుతంగా తెరకెక్కుతోందట. ఈ సినిమా కథ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కానీ జూ ఎన్టీఆర్ కేవలం బోయపాటి వద్దే అరడజను పైగా కథలు విని దీనిని ఒకే చేశాడని విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రంతో ఎన్టీఆర్ కి మరో సింహాద్రి లాంటి హిట్ ఇవ్వాలని బోయపాటి శ్రీను అహర్నిశలూ కృషి చేస్తున్నాడు. . జూ ఎన్టీఆర్ నుంచి పూర్తిస్థాయి మాస్ సినిమా వచ్చి చాలా ఏళ్లవుతోంది. దమ్ముతో ఆ లోటు మొత్తం తీరిపోతుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. అందుకు తగ్గట్టే ఈ సినిమాతో ఎన్టీఆర్ రికార్డుల మోత మోయించడం ఖాయమని ఇండస్ట్రీలో గుసగుసలు...


Click it and Unblock the Notifications











