కిరణ్ రాథోడ్ 'వసూల్ రాణి'
హైస్కూల్ సినిమా తర్వాత కిరణ్ రాథోడ్ కి తమిళంలో మంచి అవకాశం వరించింది. తమిళంలో సంచలన విజయం సాధించిన 'వసూల్' చిత్రాన్ని లక్ష్మీ బాలాజీ సినిమా ప్రొడక్షన్ పతాకంపై అడ్డాల. వెంకటరావు, చింతలపూడివాసు సంయుక్తంగా తెలుగుప్రేక్షకులకు 'వసూల్‌రాణి" పేరుతో అనువదిస్తున్నారు. తమిళంలో సంచలన విజయం సాధించిన 'వసూల్' చిత్రాన్ని 'వసూల్ రాణి' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నామని నిర్మాతలు తెలియజేశారు. డబ్బే అన్నిటికంటే ప్రధానం. డబ్బు సంపాదించడానికి ఏం చేసినా తప్పులేదు అనే ధృఢమైన అభిప్రాయంతో మోసాలు చేసే ఓ సెక్సీస్టార్ కిరణ్ రాథోడ్ ప్రధాన పాత్రలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగు అనువాద కార్యక్రమాలను త్వరలో ప్రారంభించనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఇందులో ఓ యువకుడు ఓ సినీస్టార్‌ను గాఢంగా ప్రేమించి మోసపోవడంతో తన మిత్రుని సాయంతో ఆ నటిని హతమార్చడానికి ప్రయత్నిస్తాడు. చివరికి ఆ యువకుడు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నదే చిత్ర కథాంశము అని నిర్మాతలు తెలియజేశారు. ఈ నెల 20 నుంచి చెన్నైలో అనువాద కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అద్భుతమైన 5 పాటలను మంచి లొకేషన్స్‌లో చిత్రీకరించడం జరిగిందని వారు తెలిపారు. కిరణ్ రాథోడ్, హేమంత్, షిరాజ్, పల్లవి ముఖ్యపాత్రలు పోషించినారు.


Click it and Unblock the Notifications











