AP Elections పిఠాపురంలో ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దాడి.. అసలేం జరిగిందంటే?
ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో స్వల్ప ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఈ అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీ, అధికార వైసీపీ కార్యకర్తల తీరుపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాత్రి నుంచి జరిగిన కొన్ని సంఘటనలు ఘర్షణ వాతావరణానికి దారి తీసేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఓటర్లను ఓటు వేయకుండా వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని జనసేన నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఓటుకు నోటు ఇస్తామని చెప్పి తమ ఓటర్ స్లిప్పులను తీసుకెళ్లారు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తున్నది. దాదాపు 100కిపైగా ఓటర్ స్లిప్పులను వైసీపీ నేతలు ఎత్తుకెళ్లారని ఆరోపించారు.

అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఓటర్ స్లిప్పులు తీసుకెళ్లిన వారు రాకపోవడంతో కంగారు పడిన ఓటర్లు.. ఏకంగా వైసీపీ నేతల ఇంటిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ సందర్భంగా ఓటర్ స్లిప్పులను మీ వద్ద ఎందుకు ఉంచుకొన్నారని ఓటర్లు ఎదురు తిరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.

ఇక వైసీపీ నేతలుగా భావిస్తున్న వారి నుంచి ఓటర్ స్లిప్పులు ఇప్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో కొంత మేరకు శాంతించారు. ఈ ఘటన చిత్రాడ గ్రామంలో చోటు చేసుకొన్నది. ఇలాంటి ఎన్ని దుర్మార్గాలు చేసినా పవన్ విజయాన్ని ఆపలేరు అని అభిమానులు మీడియాతో అన్నారు.
ఇదిలా ఉండగా, మంగళగిరిలోని లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం కాలనీలోని సహకార సంఘం కార్యాలయంలో పవన్ కల్యాణ్ తన సతీమణి లెజోనోవాతో కలిసి ఓటు హక్కు వినియోగించుకొన్నారు. సాధారణ పౌరుడిగా క్యూలో నిలచుకొని..తన ముందు ఉన్న ఓటర్లు ఓటు హక్కు వేసిన తర్వాత పవన్ కల్యాణ్ ఓటు వేయడం అందర్నీ ఆకట్టుకొన్నది.


Click it and Unblock the Notifications











