మహేష్ ‘దూకుడు’ ప్రొగ్రెస్ అండ్ హైలెట్స్..!?

By Sindhu

ప్రిన్స్ మహేష్ నటిస్తున్న 'దూకుడు" చిత్రం 2011వ సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వం వమిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి అచంట రామ్, అచంట గోపిచంద్ మరయు అనీల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 14రీల్స్ ఎంటర్టైన్ పతాకంపై జులై10న ఆడియో, ఆగష్ట్ 12న సినిమాని విడుదల చేయబోతున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఈ 'దూకుడు" చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ ఎలా జరుపుకుంటుంది? ఇంతవరకు జరిగిన షూటింగ్ ప్రొగ్రెస్ రిపోర్ట్ ఏంటి?హిట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి?అనే అంశాలపై సినీపండితుల వేస్తున్న అంచనాలు ఎలా ఉన్నాయంటే...

దూకుడు" సినిమా ఆల్రెడీ గుజరాత్ టర్కీ, దుబాయ్, స్విట్జర్లాండ్ మరియు ముంబైలో షెడ్యూల్స్ పూర్తి చేసుకుని హైదరాబాద్ ఓల్ట్ సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంది. ఈ రోజు (జూన్ 4)నుంచి సారధి స్టూడియోలో ఓ పాట చిత్రీకరించనున్నారు.

ఈ చిత్రం మహేష్ కి ఒక బిగ్ స్టార్ గాప్రూవ్ చేసుకునే అవకాశం. మహేష్ హీరోమాత్రమే కాదు, ఆయన కామెడీ సీన్స్ లో కూడా చాలా బాగా నటించాడు. ఐదు సీన్స్ మినహా మిగతా కామెడీ అంతాఫుల్ గా ప్రేక్షకులకు అలరింపచేస్తుంది. శ్రీను వైట్ల మహేష్ ని ఒక కొత్త హీరోగా చూపించేందుకు ప్రయత్నిస్ుతన్నాడు. తాను మహేష్ ని డిఫరెంట్ స్టైలయిల్ తో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. మహేష్ యాక్షన్ సీక్వెన్సెస్ లో ఎటువంటి డూప్స్ గాని, డబుల్స్ గానీ వాడలేదట. మహేష్ యాక్షన్ సీక్వెన్స్ ని సింగిల్ టేక్ లోనే కంప్లీట్ చేసేవారని యూనిట్ సభ్యులు చెపుతున్నారు.

ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ సన్నివేశాలతో పాటు ప్రతి ఒక్కరి నటన ప్రేక్షకులను అలరించనుంది. ఈ దూకుడు" మూవీతో యూత్ లో ఒక కొత్త ట్రెండ్ ఫాలో అవుతుంది. బ్రహ్మానందం క్యారెక్టర్ ని 'దూకుడు" సినిమాలో మహేష్ తో సమానంగా పెట్టారు. బ్రహ్మానందం 'దూకుడు"లో ఒక ఇంపార్టెంట్ క్యారెట్టర్ చేస్తున్నాడు. ఈయన కామెడీ చూసి ప్రేక్షకులు 'డీ, రెఢీ" లోని కామెడీని మర్చిపోతారు. ఈ కామెడీ ప్రేక్షకులను మళ్ళీ మళ్ళీ దూకుడు" మూవీని చూడటానికి ఉపయోగపడుతుంది. అన్ని పాటలు చాలా బాగా వచ్చాయి. సమంతా ఒక మంచి రోల్ ని ప్లే చేసింది. ఆమె నటన చాలా బాగుంది. మహేష్, సమంతాల మధ్య సీన్స్ చాలా బాగా వచ్చాయి. స్ర్కీన్ పై చూడటానికి యావరేజ్ పేయిర్ గా వున్నా కథకి ఈ జంట చక్కగా షూటవుతారు.

ఇక ఈ 'దకుడు"లో క్లయిమాక్స్ సినిమా ఫైనల్ రిపోర్ట్ ని చెపుతుంది. కానీ క్లైమాక్స్ సీన్స్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ క్లయిమాక్స్ కామెడీతో కొంచెం కన్ ఫ్యూజింగ్ గా వుంటుంది. కానీ దర్శకుడు దీనిని జేమ్స్ బాండ్ మూవీలాగా ముగించేద్దాం అని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. లాస్ట్ లో ఒక కామిక్ టచ్ తో క్లైమాక్స్ ని యాడ్ చేసి సినిమాని ఎండ్ చేసేందుకు దర్వకుడు శ్రీనువైట్ల కథను ప్రిపేర్ చేసుకుంటున్నాడని సమాచారం...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X