మహేష్ బాబు తాజా చిత్రం 'ఖలేజా' హైలెట్స్ ఏమిటంటే...
మహేష్ బాబు తాజా చిత్రం 'ఖలేజా' రేపు(అక్టోబర్ 7న) విడుదల కావటానికి అంతా రెడీ అయింది. మూడేళ్ళ తర్వాత మహేష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. ఇక టైటిల్ విషయమై కోర్టు ఫైనల్ తీర్పు ఇవ్వకపోయినా విడుదలకి క్లియరెన్స్ ఇచ్చేసింది. దాదాపు ప్రింట్స్ పంపిణీ ప్రారంభమైంది. ఈ సమయంలో ఈ చిత్రం గురించి కొన్ని హైలెట్స్ పరిశీలిస్తే..ఈ చిత్రం విడుదలకు ముందే 35 కోట్లు బిజెనెస్ చేయటం రికార్డుగా చెప్తున్నారు. అలాగే అల్లు అరవింద్ నైజాం, వైజాగ్ ఏరియాల పంపిణీ హక్కులకు ఎన్నడూ చెల్లించని రేటు ఇచ్చారని సమాచారం. సినిమా పరంగా చూస్తే...అతడు వంటి సంచలన విజయం సాధించిన కాంబినేషన్ రిపీట్ కావటం ఈ చిత్రానికి ప్లస్. ఇక ఆర్.సి.హెలీ కెమెరాలను మొట్టమొదటి సారిగా ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు వినియోగించారు.
యాడ్ ప్రపంచంలో పాపులర్ అయిన యాష్ భట్ ఈ చిత్రం ద్వారా కెమెరామెన్ గా పరిచయం అవుతున్నారు. యాష్ భట్ ఇంతకు ముందు రామ్ చరణ్ తేజ, ధోణిలతో కూల్ డ్రింక్ యాడ్ చేసారు. ఇక ఈ చిత్రంలో మంచి ఫామ్ లో ఉన్న అనుష్క హీరోయిన్ గా చేసింది. అలాగే ఈ చిత్రంలో హైలెట్స్ గా ఎవరూ ఊహించిని విధంగా ఉండే కెమెరా వర్క్..(ముఖ్యంగా లెంగ్తీ షాట్స్, జూమ్ ఆన్ స్టెడీ కామ్), పెట్రోలు బంక్ లో ఫైట్ సీన్ (రామ్ లక్ష్మణ్ డైరక్ట్ చేసింది), బ్రహ్మానందం, సునీల్ కీ, మహేష్ మధ్య వచ్చే కామిడీ ట్రాక్ హైలెట్ అన్నారు. ఇవీ రిలీజ్ కు ముందు ఖలేజా కు ఉన్న కొన్ని స్పెషాలిటీలు, రికార్డులు. ఇక విడుదలైన తర్వాత ఏ రేంజిలో రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











