విజయ్ దేవరకొండ వర్జినా? 19 ఏళ్ల వయసులోనే... ఇరకాటంలో పడేసిన రానా!

రానా హోస్ట్‌ చేస్తున్న నెం.1 యారి రెండో సీజన్ ప్రారంభం అయింది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ దర్శకుడు నాగ్ అశ్విన్, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో మొదలైంది. ఈ సందర్భంగా ఈ ఇద్దరి నుంచి పలు ఆసక్తికర సమాధానాలు రాబట్టారు రానా.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో నాగ్ అశ్విన్, రానా 1వ తరగతి నుంచి క్లాస్‌మేట్స్. పదవ తరగతిలో రానా ఫెయిల్ అవ్వడంతో వెనకబడిపోయారట. అప్పటి నుండి ఇద్దరి మధ్య కనెక్షన్ కట్ అయిందని, మళ్లీ లీడర్ సెట్స్‌లో ఇద్దరం కలిశామని రానా గుర్తు చేసుకున్నారు.

ఫస్ట్ కిస్ ఎక్స్‌పీరియన్స్

ఫస్ట్ కిస్ ఎక్స్‌పీరియన్స్

ఫస్ట్ కిస్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పాలని విజయ్ దేవరకొండను రానా అడగ్గా.... తాను చిన్నతనం నుండి బాయ్స్ హాస్టల్‍‌లో పెరగడం వల్ల పదో తరగతి వరకు నా జీవితంలో అమ్మాయిలు లేరు. వారంటే భయం కూడా ఉండేది. దాంతో నా ఫస్ట్ కిస్ అనుభవం చాలా లేటుగా జరిగింది. 19 ఏళ్ల వయసులో తొలి ముద్దు రుచి చూశాను అని విజయ్ దేవరకొండ తెలిపారు.

పిస్ కొట్టిన భయంకరమైన ప్లేసు

పిస్ కొట్టిన భయంకరమైన ప్లేసు

పిస్ కొట్టిన భయంకరమైన ప్లేసు ఏంటని రానా ప్రశ్నించగా.... ఓ సారి మా అంకుల్ పెళ్లిలో నేను మా ఫ్రెండ్స్ తాగేసి మామూలు కారులో వెళ్లాం. అక్కడికి వెళ్లిన తర్వాత ఖరీదైన కార్లన్నీ పార్క్ చేసి ఉన్నాయి. ఈ డబ్బులున్నోళ్ల బలుపు అనే కోపం వచ్చింది. ఆ మత్తులో ఓ ఖరీదైన కారు మీద పిస్ కొట్టాను అని విజయ్ దేవరకొండ గుర్తు చేసుకున్నారు.

విజయ్ దేవరకొండ వర్జినా?

విజయ్ దేవరకొండ వర్జినా?

మరో రౌండ్‌లో విజయ్ దేవరకొండ వర్జినా? కాదా? అని నాగ్ అశ్విన్‌ను అడగ్గా.... 19 ఏళ్లకే ముద్దు పెట్టాడంటే వర్జిన్ కాదని నా అనుమానం అని వ్యాఖ్యానించారు. దీనికి విజయ్ స్పందిస్తూ అంత తొందరగా నో అని చెబుతావేంటి? 19 ఏళ్లకే నేను ముద్దుతో ఆపేసి ఉండొచ్చు కదా? అంటూ కౌంటర్ వేశారు. నేను ఇప్పటికే వర్జిన్ అని స్పష్టం చేశాడు విజయ్.

ఇష్టమైన దర్శకుడు

ఇష్టమైన దర్శకుడు

తనకు ఇష్టమైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అని.... విజయ్ దేవరకొండ సమాధానం ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘అర్జున్ రెడ్డి' సినిమా రూపొందిన విషయం తెలిసిందే.

నిక్ నేమ్

నిక్ నేమ్

మీ నిక్ నేమ్ ఏమిటని అడ్డగా.... విజ్జు అని చాలా తక్కువ మంది పిలుస్తారు. ఇంట్లో చిన్నప్పటి నుండి చిన్ను అని పిలుస్తారని విజయ్ ఈ సందర్భంా వెుల్లడించారు. తనకు ఇష్టమైన ఫ్రూట్ మ్యాంగో, సీతాఫలం అని తెలిపారు.

Recommended Video

NOTA Movie First Day Collections | Vijay Devarakonda | Mehreen Pirzada | Filmibeat Telugu
నా బయోపిక్ తీస్తే టైటిల్

నా బయోపిక్ తీస్తే టైటిల్

నీ బయోపిక్ తీస్తే టైటిల్ ఏది ఉంటే బావుంటుంది? అనే ప్రశ్నకు విజయ్ స్పందిస్తూ.... ‘ది కింగ్ ఆఫ్ ది హిల్' అని సమాధానం ఇచ్చారు. అమ్మాయిలా మారితో ఎవరిలా మారుతారు? అంటే సోనియా గాంధీ అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X