Acharya Trailer Highlights:పాదఘట్టం మీద కాలేస్తే..ఏ కాలు తీసేయాలంటే? ఆచార్య ట్రైలర్‌లో మెగా పవర్ పెర్ఫార్మెన్స

తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు ఎదురు చూపులకు ఫలితం దక్కింది. ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో రిలీజ్ చేసిన ఆచార్య ట్రైలర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ట్రైలర్‌లోని ముఖ్యం అంశాలు ఏమిటంటే..

పాదఘట్టం ఊరు నేపథ్యంగా

పాదఘట్టం ఊరు నేపథ్యంగా


ఆచార్య ట్రైలర్‌ ప్రారంభంలో రాంచరణ్ తన ఊరు, ప్రజల గురించి క్లారిటీ ఇస్తూ.. దివ్య వనం ఒకవైపు.. తీర్థ జనం ఒకవైపు.. నడుమ పాదఘట్టం. ఇక్కడ అందరూ సౌమ్యులు.. పూజలు చేసుకొంటూ.. కష్టాలు వచ్చినప్పుడు అమ్మోరు తల్లిపై భారం వేసి ఉంటావేమో అని పొరపాటుపడి ఉండొచ్చు. కానీ ఆపద వస్తే.. ఆ అమ్మోరు తల్లే ఆవహించి ముందుకు పంపుతుంది. ధర్మస్థలి.. ఆ ధర్మస్థలి ఎలా ఉంటుంది అంటే అని సిద్దాగా రాంచరణ్ తమ అభిమతాన్ని తెలియజేస్తాడు. ట్రైలర్‌లో పది నిమిషాలు చాలా ఎమోషనల్ అంశాలు కనిపించాయి.

ఇంకా కాళ్లు చచ్చు పడలేదంటే

ఇంకా కాళ్లు చచ్చు పడలేదంటే


పాదఘటం ప్రజల గుండెల మీద మోపిన కాళ్లు ఇంకా చచ్చు పడలేదంటే.. ఇంకా ఏం చూడాలని కోరుకొంటుందో ఈ మహా తల్లి అని ఊరి జనం అనుకొంటుండగా.. ఆచార్య చిరంజీవి ఎంట్రీ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. పాదఘటం ప్రజల గుండెలపై కాళ్లు వేస్తే.. ఆ కాలు తీసేయ్యాలి. కాకపోతే ఏ కాలు తీయాలా అని ఊరిపై దుర్మార్గానికి పాల్పడుతున్న నీచులకు ఆచార్య గుణపాఠం చెబుతుంటాడు. మెగాస్టార్ ఎంట్రీ మరింత పవర్‌ఫుల్‌గా ఉందనిపిస్తుంది.

నలుగురిని కొట్టేస్తే అంటూ

నలుగురిని కొట్టేస్తే అంటూ


కానీ ఆచార్య గుణపాఠాన్ని జీర్ణించుకోలేని సోనుసూద్.. ఊర్లోకి వచ్చి ఒకరిద్దరు ముక్కు మొహం తెలియని నా కొడుకులను కొట్టి.. ఏదో చేసేశావని అనుకొంటున్నావా అని అంటే.. చిరంజీవి జవాబిస్తూ.. నేను వచ్చానని చెప్పాలనుకొన్నా. కానీ నేను చేయడం మొదలుపెడితే.. అంటూ ఊరిపై అరాచకాలకు పాల్పడుతున్న వారిపై ఆచార్య ప్రతాపం చూపించాడు. ఇలా యాక్షన్, ఎమోషన్స్ కలిపిన ఈ ట్రైలర్‌ మాత్రం అభిమానులకు పండగ భోజనాన్ని నింపేలా ఉంది.

సిద్దా తెలుసా అంటూ

సిద్దా తెలుసా అంటూ


ఒక దశలో సిద్దా తెలుసా అని తనికెళ్ల భరణి అడుగగా.. కామ్రేడ్ అనగానే.. రాంచరణ్ నక్సలైట్‌గా ఎంట్రీ ఇచ్చి.. పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌తో తండ్రి కొడుకులు చెలరేగిపోయారు. ట్రైలర్ ఆద్యంత భావోద్వేగంతో సాగింది. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ స్టామినాకు తగినట్టుగా దర్శకుడు కొరటాల శివ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేశాడనే విషయం ఆచార్య ట్రైలర్ చెప్పకనే చెప్పింది. ఆచార్య ట్రైలర్‌లో రకరకాల ఎమోషన్స్, భక్తిభావం అలాంటి అంశాలు ఫుల్ మీల్స్‌గా మార్చేశాయి.

అంచనాలు పెంచిన ఆచార్య ట్రైలర్

అంచనాలు పెంచిన ఆచార్య ట్రైలర్


ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, మూడు పాటలు ఆచార్యపై భారీ అంచనాలు నింపాయి. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రైలర్ మాత్రం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్‌.. ఏప్రిల్ 29 ఎప్పుడొస్తుందా అనే ఉత్కంఠను నింపింది. ఈ ట్రైలర్ చేసే హంగామా, రికార్డుల గురించి వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X