బిగ్ బాస్ హిమజకు బంపర్ ఆఫర్.. ఏకంగా పవన్ కళ్యాణ్‌తోనే చాన్స్

బిగ్ బాస్ ఫేమ్ హిమజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై పలు సినిమాల్లో మెరిసినా కూడా అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్ బాస్ షో మాత్రం హిమజకు మంచి పాపులార్టీని తీసుకొచ్చింది. బిగ్ బాస్ తరువాత హిమజ లైఫ్ మొత్తం టర్న్ అయింది. అప్పటి నుంచి సినిమాల్లో మంచి అవకాశాలను అందుకుంటోంది. బయట షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ అంటూ కూడా బాగానే సంపాదిస్తోంది.

సోషల్ మీడియాలో అలా..

సోషల్ మీడియాలో అలా..

ఇక సోషల్ మీడియాలో అయితే హిమజ చేసే సందడి అంతా ఇంతా కాదు. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడూ కూడా బిగ్ బాస్ ఇంటి సభ్యులైన రవికృష్ణ, రోహిణి, శివజ్యోతిలతో ఎప్పుడూ కలిసి సందడి చేస్తుంటుంది. ఇక స్పెషల్ ఈవెంట్లు, ప్రోగ్రాంలో హిమజ దుమ్ములేపుతుంటుంది.

బుల్లితెరపైనా..

బుల్లితెరపైనా..

వెండితెరపై సినిమా అవకాశాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా.. బుల్లితెరపైనా స్పెషల్ ఈవెంట్లతో అభిమానులను పలకరిస్తుంటుంది. జబర్దస్త్ వంటి షోల్లో గెస్ట్‌గా కనిపిస్తుంటుంది. ఇక పండుగలకు వచ్చే స్పెషల్ ఈవెంట్లతోనూ హిమజ ఆకట్టుకుంటుంది.

తాజాగా అలా..

తాజాగా అలా..

అయితే తమ అభిమాన హీరోను కలిస్తే ఎవ్వరైనా సరే గాల్లో తేలిపోతుంటారు. అలా తమ హీరోను చూడటమే గొప్ప అనుకుంటే.. కలిసి పని చేసే అవకాశం వస్తే భూమ్మీద కాలు నిలుస్తుందా? ఇప్పుడు హిమజ అదే పరిస్థితిలో ఉంది. పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమాలో హిమజ నటిస్తోందట.

డైరెక్ట్‌గా చూస్తానా?

డైరెక్ట్‌గా చూస్తానా?

పవన్ కళ్యాణ్ సినిమాలో ఆయనతో పాటు నటిస్తున్నానంటూ హిమజ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ.. ఓ మై గాడ్.. నా కల నిజమైన రోజు..పవన్ కళ్యాణ్ గారిని తొలిప్రేమ సినిమాలో చూసినప్పుడు ఆయన్నీ కనీసం డైరెక్ట్‌గా చూస్తానా? అనుకున్నా.. కానీ ఈ రోజు నాకు ఆ అవకాశం వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు క్రిష్ గారికి థ్యాంక్స్ అంటూ ఎమోషనల్ అయింది.

 అప్డేట్ కూడా..

అప్డేట్ కూడా..

ఇక పవన్ కళ్యాణ్ క్రిష్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌కు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న PSPK 27 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను విడుదల చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X