ముద్దులు వద్దు బాబోయ్ అంటున్న తమన్నా!
అయితే, హిమ్మత్ వాలాతో బాలీవుడ్‌లో అడుగు పెడుతున్న తమన్నా మాత్రం వాటికి దూరం అంటోంది. తాను ఆన్ లిప్ టు లిప్ ముద్దులకు, బికినీలకు దూరంగా ఉంటానని తమన్నా చెబుతోందట. ప్రముఖ దిన పత్రికతో మాట్లాడిన తమన్నా.. తాను బికినీలోను కనిపించలేదని, కనిపించనని చెప్పారట. అదే విధంగా ముద్దుకు కూడా దూరంగా ఉంటానని చెప్పారట.
సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తానని తెలిపింది. అభిమానులను అలరించే సినిమాల్లో నటిస్తానని చెప్పిందట. తాను నటిస్తున్న హిమ్మత్ వాలా చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని ఆమె చెప్పింది. కాగా, హిమ్మత్ వాలా చిత్రానికి సాజిద్ ఖాన్ ఈచిత్రానికి సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా వాసు భగ్నాని, యూటీవీ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వస్తోంది. వాస్తవానికి హిమ్మత్ వాలా సినిమాకు మూలం టాలీవుడ్లోనే ఉంది. తెలుగులో కృష్ణ, జయప్రద జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊరికి మొనగాడు' చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది.


Click it and Unblock the Notifications












