ప్లాప్ అంటారా? ....క్రిటిక్స్ మీద విరుచుకుపడ్డ దర్శకుడు
ఈ నేపధ్యంలో సాజిద్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ...' అందరూ సక్సెస్ కొట్టాలనే సినిమాకోసం పనిచేస్తాం. అయితే సినిమా విజయం కావటానికి చాలా అంశాలు దోహదపడతాయి. నాకు తెలిసి అవార్జు పంక్షన్స్ రియాల్టి షోలు తరహాలో ఏర్పాటు చేస్తారు. నేను అవార్డులను కానీ,రివ్యూలను కానీ పట్టించుకోను. కేవలం నేను భాక్సాఫీస్ కలెక్షన్స్ ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాను... ,' అని ఆక్రోశం వెల్లగక్కాడు.
తమన్నాసైతం 'హిమ్మత్ వాలా' చిత్రంలో అవకాశం రావడంతో బాలీవుడ్ భవిష్యత్‌పై ఎన్నో అంచనాలు పెట్టుకుంది. అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోతో చేయడం బాగా కలిసొస్తుందని ఆశలు పెట్టుకుంది. కానీ ఆమె అంచనాలు తారుమారయ్యాయి. సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో తమన్నా ఆశలు అడియాశలయ్యాయి.
80ల్లో వచ్చిన 'హిమ్మత్‍వాలా' లాంటి గొప్ప చిత్రాన్ని రీమేక్ చేసుకునేటప్పుడు దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ దర్శకుడు సాజిద్ ఖాన్ ఈచిత్రాన్ని తెరకెక్కించిన తీరు చెత్తగా ఉంది. ఇరిటేటింగ్ మెలో డ్రామా, ఓవర్ యాక్టింగ్, కుళ్లు జోకులు, తెలివితక్కువ తనంతో జొప్పించని వినోదం పాళ్లు, వికృతమైన డాన్స్ స్టెప్పులు ఇలా సినిమాను కంపు కొట్టించాడు అని బాలీవుడ్ మీడియా ఏకేసింది.


Click it and Unblock the Notifications












