‘హిమ్మత్‌వాలా’ టాక్, తమన్నాకు చేదు అనుభవం!
హైదరాబాద్: సౌత్‌లో టాప్ హీరోయిన్లుగా వెలిగిన వారంతా బాలీవుడ్ బాట పడుతున్న సంగతి తెలిసిందే. త్రిష, కాజల్, ఇలియానా లాంటి హీరోయిన్లు సౌత్ లో ఓ వెలుగు వెలిగి బాలవుడ్ బాట పట్టిన వారే. వీరిలో కొందరు నిలొక్కుకుంటే, కొందరు తొలి ప్రయత్నంలోనే బోల్తా పడి తిరుగు టపా పట్టగా.... ఇంకొందరు ఒకటి అరా అవకావాలతో బాలీవుడ్‌నే పట్టుకుని పట్టుకుని వేలాడుతున్నారు.
తాజాగా 'హిమ్మత్‌వాలా' చిత్రంతో బాలీవుడ్ ఎంట్ర ఇచ్చిన తమన్నాకు తొలి ప్రయత్నంలో చేదు అనుభవమే మిగిలింది. ఈ చిత్రం విజయవంతం అయితే బాలీవుడ్లో జెండా బలంగా పాతేయచ్చొనుకున్న తమన్నకు కాలం కలిసి రాలేదు. ఈ రోజు విడుదలైన 'హిమ్మత్‌వాలా' చిత్రం బిలో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.
1983లో శ్రీదేవి-జితేంద్ర జంటగా వచ్చిన 'హిమ్మత్‌వాలా' చిత్రానికి రీమేక్ వచ్చిన సినిమా కావడంతో తమన్నా-అజయ్ దేవగన్ జంటగా నటించి 'హిమ్మత్‌వాలా' చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా ఆ అంచనాలను అందుకోలేక పోయింది. తమన్నా గ్లామర్, అజయ్ దేవగన్ యాక్షన్, కామెడీ సీన్లు బాగునప్పటికీ సాజిద్ ఖాన్ వీక్ డైరెక్షన్ మూలంగా సినిమా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించలేక పోయింది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న తమన్నా బాలీవుడ్ ప్రస్థానంపై నీలి నీడలు కమ్ముకున్నట్లయింది.


Click it and Unblock the Notifications











