దక్షిణాదిన సంచలన విజయం సాధించిన చిత్రం గజిని. ఇప్పుడు ఆ చిత్రం హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ హీరోగా, ఆసిన్ హీరోయిన్ గా చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ సమయంలో అమీర్ గాయపడటంతో విడుదల ఆలస్యం కానుంది. దీనిపై మీడియాతో చిత్ర దర్శకుడు మురుగదాస్ మాట్లాడుతూ అక్టోబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతంతో మంచి మెలోడి పాటలను అందించనున్నారని తెలుస్తోంది.