'కాక్ టెయిల్' తెలుగు రీమేక్ ఖరారు
దీపికా పదుకోనె, సైఫ్ అలీ ఖాన్,డయానా పెంటీ కాంబినేషన్ లో రూపొందిన హిందీ చిత్రం 'కాక్ టెయిల్'. హోమీ అదజానియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యువతకు బాగా పట్టుకుని మంచి హిట్ అయ్యింది. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం రీమేక్ రైట్స్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఎక్కడ హిట్ చిత్రాలు వచ్చినా వాటిని రీమేక్ చేసో,డబ్బింగ్ చేసో డబ్బులు చేసుకునే బెల్లంకొండ సురేష్ దృష్టి ఈ హిందీ హిట్ పై పడింది. ఆయన మంచి ఎమౌంట్ ఇచ్చి ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. తెలుగుకు సిద్దార్ద ని హీరోగా అడుతున్నట్లు సమాచారం.
మల్టి ప్లెక్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ చిత్రం ట్రయాంగిల్ లవ్ స్టోరీగా కనపడుతూ సహ జీవనం,ప్రేమ వంటి విషయాల మధ్య నడుస్తూంటుంది. కథ ప్రకారం...తను సహజీవనం చేస్తూ ఉన్న అమ్మాయి..స్నేహితురాలుతో ప్రేమలో పడే హీరో కథే ఇది. కాక్ టయిల్ చిత్రంలో తాను నటించిన వెరోనికా పాత్ర తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందంటోంది దీపికా పదుకోని. ఆమె తన పాత్ర కోసం పడ్డ కష్టం చెపుతూ..ఈ సినిమాలో నా బాడీ షేప్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. సాధారణ భారతీయుల శరీర ఆకృతికి ఆ పాత్రకు సరిపడదు. అందుకోసం చాలా సార్లు డిన్నర్లకు దూరంగా ఉన్నాను అంది.
ఇక తన పాత్రను వివరిస్తూ...వెరోనికా పుట్టడంతోనే ఆమె తల్లి తండ్రలు చనిపోతారు. నిజమైన ప్రేమకు దూరంగా,కాంటాక్ట్ ప్రేమ మధ్య వెరోనికా పెరుగుతుంది. దీంతో ఆమె ప్రవర్తన కూడా మిగతావారికి బిన్నంగా ఉంటుంది. ఆత్మ విశ్వాసం ఉన్న అమ్మాయిగా,జల్సాలకు అలవాటు పడ్డ అమ్మాయిగా తనను తాను తయారు చేసుకుంటుంది. ఇలాంటి పాత్ర చేయటం ఇదే తొలిసారి. ఇక సైఫ్ గురించి ఎంత చెప్పినా సరిపోదు. నేను..సైఫ్ కలిసి నటించిన మూడో చిత్రం ఇది అంది.


Click it and Unblock the Notifications











