హిందీ ఖాకీ.. తెలుగులో..

By Staff

హీరో రాజశేఖర్‌ గురించి సినిమా ఇండస్ట్రీలో చాలా జోకులు పేలుతుంటాయి. ఆయనకు నేరుగా కథ చెబితే అర్థం కాదని, ఏదైనా ఆయన కళ్లతో చూస్తే తప్ప నమ్మలేరని.. అందుకే ఆయన స్ట్రయిట్‌గా కథలు విని ఓకె చేసినవి ఈ మధ్యకాలంలో లేవు. హిందీ, తమిళం, మళయాలం.. భాష ఏదైనా సరే.. ఆయన సినిమా చేయాలంటే.. రెండే రెండు ప్రమాణాలుండాలి. ఒకటి ఆ సినిమా కచ్చితంగా పరభాషా చిత్రం అయి ఉండాలి. అక్కడ కొద్దో గొప్పో అది హిట్‌ అయి ఉండాలి. ఈ రెండు కండిషన్లు కుదిరితే.. రాజశేఖర్‌ ఓకె అనేస్తారు. ఆ కథ తెలుగు ఆడియెన్స్‌కి నప్పుతుందా, లేదా, ఇక్కడి వాతావరణానికి అది సరిపోతుందా? వంటి విషయాలేమీ ఆయన పట్టించుకోరు.

హిందీలో పదేళ్ల కిందట వచ్చిన ఘాతక్‌ని ఈ మధ్య ఆప్తుడు పేరుతో తీసి చేతులు కాల్చుకున్నారు. తమిళంలో విక్రమ్‌ హీరోగా విడుదలై హిట్‌ సాధించిన సేతు చిత్రాన్ని తెలుగులో శేషు పేరుతో తీశారు. అదీ భార్యామణి జీవిత దర్శకత్వంలో.. అంతటి మెలోడ్రామా నప్పక తెలుగు ప్రేక్షకులు దాన్ని తిప్పికొట్టారు. మళయాలంలో హిట్‌ సాధించిన రన్‌వే చిత్రాన్ని తెలుగులో కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో నాయకుడు చిత్రంగా, అజిత్‌ హీరోగా వచ్చిన విలన్‌ చిత్రాన్ని అదే టైటిల్‌తో తెలుగులోనూ ఆయన నటించి.. ఘనమైన ఫ్లాపులు అందించారు.

ఇంత జరిగినా, రాజశేఖర్‌కి పరభాషా చిత్రాలపై ఉన్న మోజు ఇంకా తీరడం లేదు. మళయాలంలో హిట్‌ కొట్టిన లయన్‌ చిత్రాన్ని ప్రస్తుతం ఎవడైతే.. నాకేంటి? టైటిల్‌తో తెలుగులో రూపొందిస్తున్న చిత్రంలో రాజశేఖర్‌ నటిస్తున్నారు. ఆ తర్వాత చిత్రానికి కూడా ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం.

అమితాబ్‌, అజయ్‌ దేవగన్‌, అక్షయ్‌ కుమార్‌, ఐశ్వర్యారాయ్‌ తదితరులు నటించిన రాజ్‌కుమార్‌ సంతోషి చిత్రం ఖాకీ.. తెలుగులో రీమేక్‌ చేయడానికి రాజశేఖర్‌ సంకల్పించినట్టు సమాచారం. సత్యమేవ జయతే.. అని టైటిల్‌ కూడా పరిశీలనలో ఉంది. ఈ చిత్రానికి రాజశేఖర్‌ జీవిత భాగస్వామి దర్శకత్వం చేయబోతున్నారు. జనవరి 2007లో ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక ఎన్‌ ఆర్‌ ఐ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చినట్టు సమాచారం.

మరిన్నికథనాలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X