'మగధీర' హిందీ రీమేక్ ఖరారు.. డిటైల్స్

By Srikanya

రామ్ చరణ్ తేజ్, కాజల్ కాంబినేషన్ లో రాజమౌళి రూపొందించిన చిత్రం మగధీర. ఈ చిత్రం హిందీ రీమేక్ రైట్స్ పై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే తాజాగా అవి కొలిక్కి వచ్చినట్లు బాలీవుడ్ సమాచారం. అనురాగ కాశ్యప్, వికాశ్ భల్ కలిసి ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారని సమాచారం. రాక్ చిత్రం డైరక్ట్ చేసిన అభిషేక్ కపూర్ ఈ రీమేక్ ని తెరకెక్కించనున్నారని చెప్తున్నారు. అలాగే రణబీర్ సింగ్ ని ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్రకు అనుకుంటున్నట్లుగా చెప్తున్నారు. ఇక గతంలో హృతిక్ రోషన్ ఈ పాత్ర చేస్తాడని వినిపించింది.

అలాగే కాజల్ సైతం తాను హిందీలో సైతం ఆ పాత్రను చేయటానికి సిద్దమే అని ప్రకిటించింది. అయితే ఇన్నాళ్ళుగా దాని రైట్స్ ఎవరూ తీసుకోలేదు. మరో ప్రక్క అల్లు అరవింద్ సైతం మంతెన మధు తో కలిసి గజనీ తరహాలో భారీగా ఈ చిత్రం నిర్మిద్దామని ప్లాన్ చేసారు. కానీ అదీ వర్కవుట్ కాలేదు. మొత్తానికి రిలీజైన ఇన్నాళ్లకు ఈ చిత్రం హిందీలోకి వెళ్తోంది. మరో రెండు నెలల్లో కాస్టింగ్ పూర్తి చేసి షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X