చిరంజీవి హిట్ మూవీ రీమేక్‌లో సల్మాన్ ఖాన్
ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరో సౌత్ రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. గతంలో మెగా స్టార్ చిరంజీవి నటించిన 'స్టాలిన్' చిత్రం రీమేక్ లో సల్మాన్ నటించబోతున్నాడు. స్టాలిన్ సినిమాకు కథ, దర్శకత్వం మురుగదాస్. హిందీ వెర్షన్ స్టాలిన్ మూవీకి సల్మాన్ బ్రదర్ సొహైల్ ఖాన్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ తన ట్విట్టర్ ద్వార వెల్లడించారు.
స్టాలిన్ సినిమా ఒక సామాన్య వ్యక్తికి...అవినీతి రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో సాగుతుంది. గతంలో సల్మాన్ ఖాన్ పలు దక్షిణాది సినిమా రీమేకుల్లో నటించి భారీ విజయాలు సొంతం చేసుకున్నాడు. తాజాగా స్టాలిన్ సినిమా కూడా తన ఇమేజ్ కు సరిపోయే విధంగా ఉండటంతో రీమేక్ కు రెడీ అయ్యాడు సల్మాన్.
సల్మాన్ ఖాన్ సినిమాల వివరాల్లోకి వెళితే..
సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం 'ఏక్ థా టైగర్' చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 200 కోట్ల వరకు వసూలు చేసింది. తొలి నాళ్లలో ఈ సినిమా కేవలం సల్మాన్ ఖాన్ స్టార్ ఇమేజ్ పైనే ఆడింది. సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం బిజినెస్ క్రమ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈచిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో ఈచిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











