twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #YCPTerroristsAttack బాలకృష్ణ ఇంటిపై దాడి.. హిందూపూర్‌లో టెన్షన్.. టెన్షన్

    |

    ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం రణరంగాన్ని తలపిస్తున్నది. తెలుగు దేశం పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడం అత్యంత వివాదంగా మారింది. హిందూపూర్‌లోని నందమూరి బాలకృష్ణ ఇంటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయనే ఆరోపణలపై

    భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయనే ఆరోపణలపై


    ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కాలంలో భారీ ఎత్తున్న డ్రగ్స్ పట్టుబడ్డాయనే వార్తల నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశం తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇంటిని టార్గెట్‌గా చేసుకొని దాడులు చేశారు.

    బాలకృష్ణ ఇంటిపై దాడి

    బాలకృష్ణ ఇంటిపై దాడి


    వైసీపీ నేతల దాడుల్లో భాగంగా హిందూపూర్‌లోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిపై వైసీపీగా కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు దాడులకు దిగారు. అంతేకాకుండా హిందూపురంలోని పార్టీ టీడీపీ కార్యాలయంపై కూడా దాడులకు దిగినట్టు వార్తలు అందుకొన్నాయి. అంతేకాకుండా హిందూపూర్‌లోని వైసీపీ కార్యకర్తలు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు సమాచారం.

    హిందూపూర్‌లో పరిస్థితిని అంచనా వేస్తున్న బాలయ్య

    హిందూపూర్‌లో పరిస్థితిని అంచనా వేస్తున్న బాలయ్య


    తన ఇంటిపై, కార్యాలయంపై జరిగిన దాడి సమయంలో బాలకృష్ణ హిందూపూర్‌లో లేరని తెలుస్తున్నది. అయితే తన కార్యకర్తలు, స్థానిక నేతల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొంటూ బాలకృష్ణ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. బాలకృష్ణ పరిస్థితులను బేరీజు వేసుకొని హిందూపూర్‌కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

    ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసానికి ప్రయత్నం

    ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసానికి ప్రయత్నం

    వైసీపీ కార్యకర్తలు జరిపిన దాడుల్లో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహంపై దాడికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ విగ్రహం ముందు ఉన్న గ్లాస్‌ను పగలకొట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఈ దాడి సీనియర్ ఎన్టీఆర్‌పై జరిపిన దాడిగా టీడీపీ కార్యకర్తలు అభివర్ణిస్తున్నారు. ఇలాంటి దాడులకు వ్యతిరేకంగా పార్టీలకతీతంగా పోరాటం చేయాలనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నది.

     #YCPTerroristsAttack ట్యాగ్ ట్రెండింగ్

    #YCPTerroristsAttack ట్యాగ్ ట్రెండింగ్

    ఇదిలా ఉండగా, ఏపీలో టీడీపీ నేత ఇంటిపై, పార్టీ నేతల దాడి ఘటనల నేపథ్యంలో సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ అభిమానులు పోస్టులతో అల్లాడిస్తున్నారు. #YCPTerroristsAttack హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. అలాగే #WhoIsDrugDonInAP, #YCPGoons, #YsJaganFailedCM, #GundaRajInAP హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

    English summary
    Hindupur MLA Nandamuri Balakrishna house, Party office attacked. Reports says alleged YSRCP cadre attacked Balakrishna house and party office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X