ఆ హాలీవుడ్ మెగా బడ్జెట్ చిత్రానికి ఆధారం రామాయణం

By Srikanya

ధర్మానికి భంగం కలిగినప్పుడు భగవంతుడు మానవ అవతారంలో వచ్చి రక్షిస్తూంటాడు అనే భగవద్గీత వాక్యం అనుసరించి అవతార్ అనే చిత్రం హాలీవుడ్ చిత్రం రూపొందుతోంది. మూడు వందల మిలయన్ల ఖర్చుతో నిర్మితమైన ఈ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే రాముడినీ, హిందూ పురాణాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. టైటానిక్, టెర్మినేటర్, ఏలియన్స్, ట్రూ లైస్ వగైరా భారీ హాలీవుడ్ సినిమాల దర్శకుడు జేమ్స్ కామరన్ డైరక్షన్స్ లో వస్తున్న సినిమా కావటం మరో విశేషం.

ఎప్పుడో పన్నెండేళ్ళ క్రితం వచ్చిన టైటానిక్ సినిమా తర్వాత కొన్ని డాక్యుమెంటరీలు నిర్మించిన జేమ్స్ కామరన్ ఇప్పుడు తాజాగా “అవతార్" అనే సినిమాతో మన ముందుకు రానున్నారు.ఇక ఈసారి సినిమాని పూర్తిగా 3d లో రూపొందించడమే కాకుండా గతంలో తీసిన 3d సినిమాలలా కాకుండా ఈ సినిమా కోసం ఒక కొత్తరకమైన టెక్నాలజీని కూడా రూపొందించుకున్నారని సమాచారం. ఇక 'టైటానిక్' విడుదలైన 12 ఏళ్లకు జేమ్స్ కామరూన్ నుంచి వస్తున్న చిత్రమిది. తొలుత 100 మిలియన్ డాలర్ల బడ్జెట్ అవుతుందని అంచనాలు వేసినప్పటికీ సినిమా పూర్తయ్యేసరికి 300 మిలియన్ డాలర్లు అయింది. అలాగే 2006లో ప్రారంభమైన ఈ చిత్రం ఈ మధ్యే పూర్తయింది.

దాదాపు 60 శాతం కంప్యూటర్ గ్రాఫిక్స్,40 శాతం లైవ్ యాక్షన్ ల సమాహారంతో ఈ చిత్రం రూపొందినట్టు తెలుస్తోంది. హాలీవుడ్ లో ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు వీక్షించే అవకాశం ఠాగూర్ మధు ద్వారా రానున్నది. ఆయన ఈ చిత్రం రైట్స్ మంచి పోటీలో తీసుకున్నారు. డిసెంబర్ లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నామనీ మధు తెలిపారు.ఠాగూర్ చిత్రం తర్వాత అల్లు అరవింద్ తో కలిసి హిందీ 'గజనీ' చిత్రాన్ని మధు నిర్మించారు. ఇటీవలే రైట్స్ తీసుకుని 'మహాత్మ' చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటా రిలీజ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X