నా గత జన్మ రహస్యం ఇదే.... మోనికా బేడీ

By Srikanya

'గత జన్మలో నేను పోర్చుగీసులో ఉండేదాన్ని. అందుకే నాకు ఇప్పటికీ అక్కడికి వెళ్లగానే ఏదో అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు ముగ్గురు పిల్లలు కూడా. అంటూ తన గత జన్మ వివరాలు వరసగా చెప్పేసింది మోనికా బేడీ. అబూ సలేం కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చిన ఈ బాలీవుడ్ భామ క్రితం జన్మలో తానెవరో చెప్పి ఆశ్చర్యపరిచింది. అంతేగాక అప్పట్లో నేను క్రిస్టియన్‌ను అందుకే.. ఇప్పుడూ నేను ఆ మతానికే ఆకర్షితురాలినవుతున్నాను. నేను 70 ఏళ్లకే ప్రశాంతంగా చనిపోయాను' అని మోనికా టకటకా చెప్పేసింది. మగధీరుడు చిత్రంలో కాజల్, రామ్ చరణ్ లా ఆమె తన గత జన్మను నెమరువేసుకుంటూ ఉత్సాహంగా ఉంది.

క్రితం జన్మలో తనెవరో.. తన పిల్లలెవరో.. తను ఎలా చనిపోయిందో కూడా తెలిపింది. ఇదెలా సాధ్యమైందంటే.. 'రాజ్‌-పిఛ్‌లే జన్మ్‌ కా'(గత జన్మ రహస్యాలు) పేరుతో ఎన్డీ టీవీలో.. త్వరలో ఓ కార్యక్రమం ప్రసారం కానుంది. ఇందుకోసం బాలీవుడ్‌ సెలబ్రిటీలతో ఎపిసోడ్ల షూటింగ్‌ జరుగుతోంది. ముంబైకి చెందిన తృప్తి జై అనే మనో విశ్లేషకురాలు.. తన థెరపీ ద్వారా గత జన్మ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. ప్రస్తుతం వారిని వేధిస్తున్న సమస్యలు, భయాలు ఇతరత్రా కారణాలకు మూలకారణం కనుగొంటుంది. మొత్తంగా గత జన్మ రహస్యాలను కూడా వారితోనే చెప్పిస్తుంది. ఇది ఈ కార్యక్రమ సారాంశం. సుస్మితాసేన్‌, సంజయ్‌దత్‌, కరీనా, సెలీనాజైట్లీ వంటి తారలు ఇప్పటికే తమ తమ 'పిఛ్‌లేజన్మ్‌' రహస్యాలు చెప్పేశారు.ఈ విధంగా మోనికా కూడా తన 'ఫ్లాష్‌బ్యాక్‌' వినిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X