బాలకృష్ణ భారీ చారిత్రక చిత్రం ఖరారు
త్వరలో చరిత్రాత్మక కథాంశంతో ఓ సినిమా నిర్మించబోతున్నాను. 600 సంవత్సరాల క్రితం మనల్ని పరిపాలించిన ఓ మహారాజు కథ ఇది. దానికి సంబంధించిన వర్క్ జరుగుతోంది. దీనికి కొతం టైమ్‌పడుతుంది కాబట్టి ఈలోపుగా ఒక సందేశాత్మక చిత్రం తీయబోతున్నాను. దానికి సంబంధించి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను అని 'శ్రీరామరాజ్యం'చిత్ర నిర్మాత యలమంచిలి సాయిబాబు చెప్పారు. నయనతార, నందమూరి బాలకృష్ణ సీతారాములుగా బాపు దర్శకత్వంలో యలమంచిలి సాయిబాబు నిర్మించిన దృశ్యకావ్యం 'శ్రీరామరాజ్యం' ఆదివారంతో వంద రోజులు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శతదినోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇలా స్పందించారు. అలాగే రామాజ్ఞతో 'శ్రీరామ రాజ్యం' సినిమా నిర్మించాను. నా తల్లిదండ్రులు కలకాలం గుర్తుపెట్టుకొనే సినిమా తీద్దామనుకొన్నాను. ఆ కల కూడా ఈ సినిమాతో నెరవేరడం ఆనందంగా ఉంది. బాపు అద్భుతమైన కళాఖండాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











