అక్కినేని ఫ్యామిలీలో కొనసాగుతున్న విడాకుల పరంపర.. ఆ నలుగురిని వెంటాడిన సమస్య!

అక్కినేని హీరోలకు పెళ్లి కలిసి రాలేదు అని నెటిజన్లు రకరకాల నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అక్కినేని నాగచైతన్య సమంతల వివాహం బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. నిజానికి విడాకుల ప్రకటన రాకుండా ఉండి ఉంటే ఈ రోజుకు సమంత రుత్ ప్రభు, నాగచైతన్య పెళ్లి జరిగి నాలుగు ఏళ్లు పూర్తి అయి ఉండేవి. సరిగ్గా నాలుగు రోజుల ముందు వారు విడాకులు ప్రకటన చేయడంతో అక్కినేని ఫాన్స్ తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా ఒక రకంగా షాక్ అనే చెప్పాలి.

అయితే అక్కినేని నాగచైతన్య సమంత రుత్ ప్రభు విడాకుల కంటే ముందు అక్కినేని ఫ్యామిలీలో చాలా విడాకులు వ్యవహారాలు ఉన్నాయని అంటున్నారు. నాగచైతన్య సమంతల విడాకులతో కలిపితే మొత్తం ఐదు జంటలు విడిపోవాల్సి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

అక్కినేని కుటుంబం

అక్కినేని కుటుంబం

అక్కినేని నాగచైతన్య, సమంత రుత్ ప్రభు విడాకుల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ మొత్తం మీద హాట్ టాపిక్ గా మారింది. అయితే వీరిద్దరి కంటే ముందే అక్కినేని కుటుంబంలో దాదాపు నాలుగు జంటలు ఇలా విడాకులు వ్యవహారంతో వార్తల్లోకి వచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని అన్నపూర్ణ దంపతులకు ఐదుగురు సంతానం కాగా అందులో అక్కినేని నాగార్జున తెలుగు హీరోగా పరిచయం అయ్యారు..

ఇక అక్కినేని వెంకట్ నిర్మాతగా కొన్ని సినిమాలు చేసిన ప్రస్తుతం సైలెంట్ గానే ఉంటున్నారు. ఇక వీరి సంతానంలో సత్యవతి పిల్లలైన సుమంత్ అలాగే సుప్రియ ఇద్దరూ కూడా తెలుగు సినీ పరిశ్రమకు సుపరిచితమే. ఇక నాగసుశీల కుమారుడు శాంతి కూడా హీరోగా రాణిస్తున్నాడు.

నాగార్జున బ్రేకప్

నాగార్జున బ్రేకప్

ముందుగా వీరి కుటుంబంలో విడాకుల వ్యవహారం మొదలైంది నాగార్జునతోనే. అక్కినేని నాగార్జున మొదట రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు ఆమె సినీ హీరో వెంకటేష్, నిర్మాత సురేష్ బాబుల సోదరి. వీరి సంతానంగా నాగచైతన్య జన్మించగా ఆరేళ్ల వివాహ బంధానికి వీరు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత లక్ష్మీ అమెరికా వెళ్లిపోగా నాగార్జున రెండేళ్ల తర్వాత అమలతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా అక్కినేని అఖిల్ జన్మించాడు. అక్కినేని కుటుంబంలో ఇది మొదటి విడాకుల వ్యవహారం.

సుమంత్ బ్రేకప్

సుమంత్ బ్రేకప్

ఆ తర్వాత నాగార్జున మేనల్లుడు సురేంద్ర యార్లగడ్డ -సత్యవతిల కుమారుడు సుమంత్ యార్లగడ్డ కూడా కెరీర్ మంచి ఫామ్ లో ఉండగా కీర్తి రెడ్డి అనే హీరోయిన్ ని ప్రేమించి ఆగస్టు 2004వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ రెండేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. కీర్తి రెడ్డి బెంగళూరు వెళ్లి సెటిల్ కాగా సుమంత్ మాత్రం అప్పటి నుంచి సింగిల్గానే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలతో బిజీ బిజీగా మారుతున్నారు.

సుప్రియా యార్లగడ్డ దాంపత్య జీవితంలో విషాదం

సుప్రియా యార్లగడ్డ దాంపత్య జీవితంలో విషాదం

ఇక సుమంత్ సోదరి సుప్రియ యార్లగడ్డ కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమైన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సుప్రియ కూడా హీరోయిన్ గా పరిచయం అయింది. అయితే ఆ తర్వాత ఆమె నటనకు దూరమై ఎక్కువగా సినీ నిర్మాణ కార్యకలాపాలలో భాగమయ్యారు. అయితే ఆమె చరణ్ రెడ్డి అనే నటుడిని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం కూడా ఎక్కువ రోజు సాఫీగా సాగలేదు, కొన్నాళ్లకు చరణ్ రెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.

అఖిల్ అక్కినేని ఎంగేజ్‌మెంట్ బ్రేకప్

అఖిల్ అక్కినేని ఎంగేజ్‌మెంట్ బ్రేకప్

ఇక అక్కినేని నాగచైతన్య సమంతల వివాహం కంటే ముందే అక్కినేని అఖిల్ శ్రియ భూపాల్ అనే ఒక యువ తో ప్రేమలో పడ్డారు. రామ్ చరణ్ భార్య ఉపాసన బంధువు అయినా శ్రియతో నిశ్చితార్థం కూడా జరిగింది ఆ తర్వాత ఈ వ్యవహారం కూడా పెళ్లి వరకు వెళ్ళలేదు. కొన్ని కారణాలతో పెళ్లి క్యాన్సిల్ అయింది. అయితే శ్రియ భూపాల్ మరో యువకుడిని పెళ్లి కూడా చేసుకోగా అఖిల్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలా కొంతమంది అయితే అక్కినేని ఫ్యామిలీకి వివాహం కలిసి రాలేదు అని కామెంట్లు చేస్తుంటే, అవి సాధారణంగా జరుగుతున్నా ఫ్యామిలీ మొత్తానికి ముడిపెట్టి చూడటం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు.

Recommended Video

Samantha పిల్లల్ని కనాలనే ఆశను చంపేశారు.. హాట్ టాపిక్ గా Madhavi Latha కామెంట్స్ | Filmibeat Telugu
నాగచైతన్య విడాకులు

నాగచైతన్య విడాకులు

ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత, నాగ చైతన్యలు విడాకులు తీసుకోబోతున్నారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. చివరికి ఆ వార్తలే నిజమయ్యాయి. తాను విడిపోతున్నామని సమంత, నాగ చైతన్య అధికారికంగా ప్రకటించారు. ఇద్దరూ ఒకే సమయంలో తాము విడిపోతున్నాం అంటూ తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. దాంతో అక్కినేని కుటుంబంలో మరో బ్రేకప్ చోటుచేసుకొన్నది.

అక్టోబర్ 6న వీళ్ల‌ 4 వ వివాహ వార్షికోత్సవ వేడుక జరగాల్సి ఉంది. కానీ నాలుగు రోజుల ముందు తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు నాగచైతన్య సమంతలు. ఈ విషయం మీద నాగార్జున కూడా స్పందిస్తూ అది వారి వ్యక్తిగత విషయం అని ప్రైవసీ ఇవ్వాలని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X