HIT 2 MAX: హిట్ 2 రియల్ హీరో కన్నుమూత.. అడివి శేష్, శైలేష్ ఎమోషనల్ ట్వీట్స్
టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీనే 'హిట్: ది సెకెండ్ కేస్'. విశ్వక్ నటించిన 'హిట్'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాను శైలేష్ కొలను తెరకెక్కించాడు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీని నిర్మించారు.
ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఇందులో సుహాస్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక, ఇందులో అత్యంత ముఖ్యమైన మ్యాక్స్ అనే పాత్రలో నటించిన పోలీస్ డాగ్ తాజాగా మరణించింది. ఈ విషయాన్ని శేష్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

తాజాగా ట్విట్టర్‌లో అడివి శేష్ 'టిక్ ఫీవర్ వల్ల సాషా కన్నుమూసిందన్న విషయాన్ని మీకు చెప్పడానికి బాధ పడుతున్నాను. ఈ డాగ్ హిట్ 2 మూవీలో మ్యాక్స్ పాత్రను చేసింది. మేము ఆస్పత్రిలో తనను చూసినప్పుడు కోలుకుంటుందని అనుకున్నాము. కానీ, చివరకు పరిస్థితి విషమించింది.
ఇది రాస్తున్నప్పుడు కన్నీళ్లు ఆగడం లేదు. అత్యంత కఠినమైన షూటింగ్ సమయంలో మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. జంతువుల్లోనే చాంపియన్ అయిన సాషా శిక్షకులు/యజమాని ఆనంద్‌కు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా' అని చెప్పాడు.
హిట్ 2 మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను కూడా సాషాతో దిగిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అంతేకాదు, 'చెదిరిన హృదయంతో నేను ఈ వార్తను మీతో పంచుకుంటున్నాను. ప్రియమైన మ్యాక్స్ ఇప్పుడే కన్నుమూశాడు. తను పది రోజులుగా తీవ్రమైన జ్వరంతో పోరాడింది.
బెజ్లియంకు చెందిన క్రూరమైన బ్రీడ్ అయినప్పటికీ సాషా నేను కలుసుకున్న అత్యంత సున్నితమైన జంతువుల్లో ఒకటి. ప్రియమైన మ్యాక్స్ మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాం. మీరు లేకపోతే హిట్ 2 ఇలా ఉండేది కాదు' అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
ఇదిలా ఉండగా.. హిట్ 2 మూవీలో పోలీస్ ఆఫీసర్ అయిన అడివి శేష్ పెంపుడు జంతువుగా సాషా నటించింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అతడిని విలన్ బంధించినప్పుడు ఈ డాగ్ ఎంట్రీ ఇచ్చి విరోచితంగా పోరాటం చేస్తుంది. ఈ సన్నివేశాలను ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అదే సమయంలో సాషా ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











