For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ ఖాన్ కేసు, పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం!

    By Bojja Kumar
    |

    ముంబై: పన్నెండేళ్ల క్రితం కారుతో నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లి, ఒకరి మృతికి కారణమైన (హిట్‌ అండ్‌ రన్‌)కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌పై కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. 2002 సెప్టెంబర్‌ 28న తెల్లవారు జామున బాంద్రాలో బేకరి బయట నిద్రిస్తున్న వారిపైకి సల్మాన్‌ కారు డ్రైవర్‌ దూసుకెళ్లగా, ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు.

    తాజాగా ఈ కేసు విచారణ జరిగింది. ఇద్దరు సాక్షులు సల్మాన్ ఖాన్‌ను గుర్తించారు. మొదటి సాక్షి వాంగ్మూలం ఇస్తూ ప్రమాదం జరిగిన రోజు సల్మాన్ ఖాన్ సొంతగా కారు నడిపారని తెలిపారు. సెప్టెంబర్ 28, 2002లో టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనంలో నడుపుతూ సల్మాన్ ఖాన్ రోడ్డు పక్కన నిద్రిస్తున్న కొంతమంది వ్యాక్తులపైకి వాహనం ఎక్కించారనే ఆరోపణలతో ఈ కేసు సాగుతోంది.

    Hit-and-run case: Key witness says Salman Khan was in SUV's driver's seat

    ముంబై సబ్ అర్బన్ బాంధ్రాలో ఓ బేకరీ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. సెప్టెంబర్‌ 2, 2005లో కేసు విచారణ మొదలయ్యింది. 2006లో 39 మంది సాక్షలను విచారించిన న్యాయస్థానం, అక్టోబర్‌ 6, 2006లో బంద్రా కోర్టు సల్మాన్‌పై పది నేరాభియోగాలు నమోదు చేసింది.

    2013 జులై 24న ఆయన శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డారని ముంబయి న్యాయస్థానం నిర్ధారించింది. బాంద్రా కోర్టు నిర్ణయం ప్రకారం ఐపీసీ 304 (ఏ) ప్రకారం సల్మాన్‌కు రెండేళ్ల శిక్షక అర్హుడవుతారని నిర్ణయించారు. అయితే బాంద్రా కోర్టు నిర్ణయంపై సల్మాన్‌ ఖాన్‌ ముంబయి కోర్టును ఆశ్రయించారు. ముంబయి కోర్టు నేరాభియోగాలు నమోదు చేసిన తర్వాత కూడా తానేతప్పు చేయలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకురావడంతో డిసెంబర్ 5వ తేదీన ఈ కేసును పూర్తిగా పునర్విచారణ చేపట్టాలని ముంబయి కోర్టు ఆదేశించింది.

    ఈ కేసులో డాక్యుమెంట్లు కనిపించకుండా పోవడంతో కేసు విచారణ ఈ ఏడాది జులైలో కోర్టు తాత్కాలికంగా నిలిపి వేసింది. సెప్టెంబర్లో డాక్యుమెంట్లు దొరికిన తర్వాత తిరిగి విచారణ ప్రారంభించింది. విచారణలో సల్మాన్ ఖాన్‌ను సాక్షులు గుర్తించారు. ఈ కేసులో సల్మాన్ ఖాన్ దోష నిర్థారణ అయినట్లయితే సుమారు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది.

    English summary
    A witness in the trial of actor Salman Khan who is facing serious charge of culpable homicide not amounting to murder for killing a pavement dweller and injuring four others in a 2002 case said it was the actor who was sitting in the driver's seat before the vehicle left the restaurant in Juhu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X