»   » సల్మాన్ నిర్దోషి అంటూ కోర్టు తీర్పు: సోషల్ మీడియాలో జోక్స్!

సల్మాన్ నిర్దోషి అంటూ కోర్టు తీర్పు: సోషల్ మీడియాలో జోక్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: హిట్ అండ్ రన్ కేసులో దాదాపు 13 ఏళ్లుగా సల్మాన్ ఖాన్ విచారణ ఎదుర్కొన్న సల్మాన్ ఖాన్ .... ఈ కేసులో నిర్దోషిగా బయట పడ్డ సంగతి తెలిసిందే. ముంబై హైకోర్టు సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా తేలుస్తూ డిసెంబర్ 10 , 2015న తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు విన్న వెంటనే సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ కన్నీళ్లు పెట్టాడు. ఏళ్లతరబడి దోషిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతను ఎట్టకేలకు నిర్దోషిగా తేలడంతో ఎమోషన్ అయ్యారు. దు:ఖం ఆపుకోలేకపోయాడు.

ఒకరి ప్రాణాలు బలిగొని, నలుగురిని గాయ పరిచిన హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా తేలుస్తూ ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మే 6, 2015న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును సల్మాన్ తరుపు న్యాయవాది ముంబై హైకోర్టులో సవాల్ చేసి విజయం సాధించారు. సరైన సాక్ష్యాలు లేనందున సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు ఈరోజు(డిసెంబర్ 10)న తీర్పు వెలువరించింది.

సల్మాన్ ఖాన్ తాగి కారు నడిపాడనటానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని, అందువల్ల ఈ కేసులో సల్మాన్‌ను దోషిగా నిర్ధారించలేమని కోర్టు వెల్లడించింది. సల్మాన్‌పై అభియోగాల నిరూపణలో ప్రాసిక్యూషన్ విఫలమైందని హైకోర్టు తీర్పునిచ్చింది. క్రింది కోర్టు తీర్పును హైకోర్టు తప్పుబట్టింది.

ప్రాసిక్యూషన్ సాక్షాల్లో లొసుగులున్నాయని హైకోర్టు పేర్కొంది. కేవలం ఊహాగానాలతో సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చమని హై కోర్టు పేర్కొంది. సెషన్స్ కోర్టు సరిగా విచారించలేదని తెలిపింది. ఈ తీర్పుతో సల్మాన్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు జరుపుకుంటున్నారు.

salman khan

సోషల్ మీడియాలో పేలుతున్న జోక్స్...
అయితే సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో జోక్స్ పేలడం ప్రారంభం అయ్యాయి. అవి క్రింది విధంగా ఉన్నాయి.

-2002లోనే భారత్ లో డ్రైవర్ రహిత కారు ఉండేవని సల్మాన్ ఖాన్ కేసులో రుజువైంది.
-సల్మాన్ ఖాన్ మద్యం తాగలేదు. తాగింది ఆయన కారే...
-సల్మాన్ ఖాన్ ను జైలు పాలు చేసే కుట్రతో కారు కింద పడిన వారిలో ఒకరు చనిపోయారు. మిగిలిన నలుగురిపై కేసు పెట్టనందుకు ప్రాసిక్యూషన్ వారికి కృతజ్ఞతలు.
-మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వమే. పిస్టర్ లైసెన్స్ ఇచ్చింది కూడా ప్రభుత్వమే. కాబట్టి నేరం ఖాన్ ది కాదు ప్రభుత్వానిది.
-మద్యం తాగి కారు నడిపి చంపలేదు. జింకనూ వేటాడలేదు.ఆ జింకే నన్ను చంపు అని సల్మాన్ ఖాన్ ను బతిమిలాడింది. అయినా వినకపోతే పిస్టర్ లాక్కొని ఆత్మహత్య చేసుకుంది.
-మందు తాగి ఖాన్ కాదు. వాళ్లకే మందెక్కువై ఖాన్ కారు కింద పడ్డారు.
-చలికాలం జలుబుచేస్తుందని తెలిసినా రోడ్డు పక్కన పడుకోవడం వారి తప్పు. అంతే కాని సల్మాన్ ఖాన్ ది తప్పు కానే కాదు.
-స్వచ్ఛ భారత్... స్వచ్ఛ సల్మాన్...

English summary
The Bombay High Court on Thursday, Dec 10 acquitted Salman Khan in hit-and-run case. It was a very emotional moment for the Bollywood superstar who broke down inside the court premises after hearing the final verdict. After Salman's acquittal in the infamous hit-and-run case, micro-blogging site Twitter was flooded with jokes on the Bollywood actor.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu