సల్మాన్‌ నిర్దోషి: శిక్ష రద్దు చేసిన హైకోర్టు, ఫ్యాన్స్ సంబరాలు!

By Bojja Kumar

హైదరాబాద్: ఒకరి ప్రాణాలు బలిగొని, నలుగురిని గాయ పరిచిన హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా తేలుస్తూ ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మే 6, 2015న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును సల్మాన్ తరుపు న్యాయవాది ముంబై హైకోర్టులో సవాల్ చేసి విజయం సాధించారు. సరైన సాక్ష్యాలు లేనందున సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు ఈరోజు(డిసెంబర్ 10)న తీర్పు వెలువరించింది.

సల్మాన్ ఖాన్ తాగి కారు నడిపాడనటానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని, అందువల్ల ఈ కేసులో సల్మాన్‌ను దోషిగా నిర్ధారించలేమని కోర్టు వెల్లడించింది. సల్మాన్‌పై అభియోగాల నిరూపణలో ప్రాసిక్యూషన్ విఫలమైందని హైకోర్టు తీర్పునిచ్చింది. క్రింది కోర్టు తీర్పును హైకోర్టు తప్పుబట్టింది. ప్రాసిక్యూషన్ సాక్షాల్లో లొసుగులున్నాయని హైకోర్టు పేర్కొంది. కేవలం ఊహాగానాలతో సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చమని హై కోర్టు పేర్కొంది. సెషన్స్ కోర్టు సరిగా విచారించలేదని తెలిపింది. ఈ తీర్పుతో సల్మాన్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు జరుపుకుంటున్నారు.

Hit-and-Run Case Verdict: Good News for Salman Khan, actor is a Free Bird now

13 సంవత్సరాల నుండి కొనసాగుతున్న విచారణ...
2002లో సంఘటన జరుగగా దాదాపు 13 సంవత్సరాలుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు సల్మాన్ ఖాన్ ను అరెస్టు చేసి బెయిల్ మీద విడుదల చేసారు. 2002 అక్టోబర్లో సల్మాన్ మీద సెక్షన్ 304-2 కింద ఉద్దేశ్యపూర్వకంగా కాని శిక్షార్హమైన నేరంగా పరిగణించి కేసు నమోదు చేసారు. 2002 అక్టోబర్ 7న సల్మాన్ ఖాన్ బాంద్రా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.

2002 అక్టోబర్ 7న సల్మాన్ ఖాన్ మీద చార్జిషీటు దాఖలైంది. అక్టోబర్ 24న సల్మాన్ ఖాన్ కు బెయిల్ లభించింది. తర్వాత 2006 అక్టోబరులో సల్మాన్ మీద పలు అభియోగాలు నమోదయ్యాయి. తర్వాత ఈ కేసు వాయిదాలు పడుతూ విచారణ సాగింది. తర్వాత 2014 జులై 24న కోర్టులో మళ్లీ కొత్తగా వాదనలు ప్రారంభం అయ్యాయి. సల్మాన్ ఖాన్ మీద మళ్లీ కొత్తగా అభియోగాలు నమోదయ్యాయి.

2014 మార్చి 27న సల్మాన్ వాంగ్మూలం నమోదు చేసారు. 2015 ఏప్రిల్ 1న కేసులో వాదనలు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 20న వాదనలు ముగిసాయి. మే 6, 2015న సెషన్స్ కోర్టు సల్మాన్ ను దోషిగా తేల్చుస్తూ ఐదేళ్ల శిక్ష విధించింది. సల్మాన్ ఖాన్ హైకోర్టును ఆశ్రయించడంతో శిక్ష నిలిపి వేసి బెయిల్ మంజూ చేసింది. వాదోపవాదాల అనంతరం డిసెంబర్ 10, 2015న సల్మాన్‌ను నిర్దోషిగా తేలుస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X