దిల్ రాజుకు బాలీవుడ్ గండం.. రెండో సినిమా 'హిట్' కూడా ఫట్టే!
తెలుగులో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా దిల్ రాజుకు మంచి పేరు ఉంది. మంచి సక్సెస్ ట్రాక్ రికార్డు ఉన్న దిల్ రాజు తెలుగులో దాదాపు చాలా సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నారు. ఒకటి అర సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచి ఉండొచ్చేమో కానీ సక్సెస్‌ఫుల్ నిర్మాతగా ఆయనకు పేరు వచ్చింది. అయితే తెలుగులో ఒక సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు తర్వాత బాలీవుడ్ లో కూడా సక్సెస్ ఫుల్ నిర్మాతగా ఎదగాలని భావించాడు. అందులో భాగంగానే తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన జెర్సీ అనే సినిమాని హిందీలో అదే పేరుతో అదే దర్శకుడుతో రీమేక్ చేయాలని భావించి షాహిద్ కపూర్ హీరోగా ప్లాన్ చేశారు..
అయితే ముందే అది ఓటీటీలో విడుదలైన క్రమంలో ఆ సినిమాను నార్త్ ప్రేక్షకులు ఎప్పుడో చూసేశారు దానికి తోడు కరోనా కేసులు కూడా తోడవడంతో ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడే తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా విడుదలైన హిట్ సినిమాను కూడా అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేయాలని భావించి రాజ్ కుమార్ రావు హీరోగా బాలీవుడ్ లో కూడా రీమేక్ చేశారు. ఆ సినిమా శుక్రవారం నాడు విడుదలైంది. కానీ అది కూడా డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది.

ఈ సినిమాకు ఏమాత్రం వసూళ్లు రావడం
లేదని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తెలుగులో మాత్రం భారీ ప్రాజెక్టులు లైన్లో పెట్టారు దిల్ రాజు. కేవలం తెలుగు వరకే పరిమితం కాకుండా అందులో రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా రూపొందిస్తున్నారు. తెలుగు సినిమా విషయానికి వస్తే నాగచైతన్య హీరోగా థాంక్యూ అనే సినిమా రూపొందించారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. మరో పక్క రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ 15వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. అలాగే విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కూడా ఒక పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారు. వారసుడు పేరుతో ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. చూడాలి ఈ రెండు సినిమాలు దిల్ రాజుకి ఎంతవరకు కలిసి వస్తాయి అని.


Click it and Unblock the Notifications











