ఇది అద్భుత అవకాశం.. HIT డైరెక్టర్ ప్రకటన

ఒకప్పుడు నటులు అవ్వాలంటే, అక్కడి వరకు చేరుకోవాలంటే, సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. సోషల్ మీడియాలో తమ ప్రతిభను చాటుకుంటూ చాలు అవకాశాలు వారినే వెతుక్కుంటూ వస్తున్నాయి. డబ్ స్మాష్, యూట్యూబ్, టిక్ టాక్ వంటి వాటిలో తమ టాలెంట్‌ను నిరూపించుకున్న వారు ఇప్పుడు వెండితెరపై వెలిగిపోతున్నారు. అయితే ఇంకా తమలో టాలెంట్ ఉండి కూడా బయటకు రాని వారెంతో మంది ఉన్నారు.

అలాంటి వారికి HIT డైరెక్టర్ శైలేష్ కొలను ఓ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. మీరు ఇంట్లోనే ఉంటూ ఆడిషన్స్ ఇవ్వొచ్చు. మీకు నచ్చిన ఏదైనా ఒక సీన్‌ను ఎమోషన్ కనిపించేలా వీడియో తీసి మెయిల్ చేయమని పేర్కొన్నాడు. లేదా అంతకు ముందు షార్ట్ ఫిలింలో నటించిన వీడియోలు అయినా సరే టాలెంట్ కనబడేలా వీడియోలను [email protected] కు పంపాలని కోరాడు తానే పర్సనల్‌గా వాటిని చూస్తానని, తనకు నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకుంటానని తెలిపాడు. ఏ వయస్సు వారైనా సరే పంపొచ్చని తెలిపాడు.

HIT director Sailesh Kolanu Casting call Announcement

అసలే HIT సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో శైలేష్ పేరు ఇండస్ట్రీలో మార్మోగింది. బాలీవుడ్‌లోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు రెడీ అయ్యాడు. మారిన పరిస్థితుల కారణంగా మేకర్స్ అందరూ ఇలానే ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఆ మధ్య డైరెక్టర్ తేజ కూడా ఆన్ లైన్ ఆడిషన్ నిర్వహించాడు. హలో యాప్ ద్వారా వీడియోలు పంపమని, నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకుంటానని తెలిపాడు. ప్రస్తుతం శైలేష్ HIT సీక్వెల్ పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X